Covid Hospital Bills
Covid Hospital Bills: కరోనా కంప్లైంట్లు పెరుగుతుండటం, ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోతుండటంతో పింపిరి-చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ (పీసీఎమ్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. పీసీఎమ్సీ డాక్టర్లు, ఆడిటర్ల టీం ఆడిట్ చేయకుండా బిల్లులు చెల్లించొద్దని చెప్పింది.
ఇదిలా ఉంటే శివసేన ఎంపీ శ్రీరంగ్ బార్నే.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల నుంచి కంప్లైంట్లు తీసుకుని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరేకు సమాచారం అందించనున్నారు. మునిసిపల్ కమీషనర్ రాజేశ్ పాటిల్ ఈ మేరకు జోనల్ లెవల్ లో ఎనిమిది మంది టీంలను ఏర్పాటు చేశారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే వసూలు చేస్తున్నాయా.. ఆ మెడికల్ బిల్స్ అప్రూవ్ అయినవా కాదా అని నిర్ధారిస్తారు. అంతేకాకుండా పీసీఎమ్సీ 30 మంది ఇంజినీర్లను అపాయింట్ చేసకుని బిల్ వెరిఫికేషన్ ప్రోసెస్ నిర్వహించనుంది.
‘బెడ్ మేనేజ్మెంట్ కోసం ఇంజినీర్లను అపాయింట్ చేసకున్నారు. వాళ్లు హాస్పిటల్ కు రెగ్యూలర్ గా వెళ్లి.. కంప్లైంట్లు, అకారణంగా బిల్లులు వసూలు చేస్తున్నారా అని వాకబు చేస్తారు. కొవిడ్-19 బాధితుల కుటుంబాలను కలిసి మాట్లాడతారు’ అని పీసీఎమ్సీ జాయింట్ సిటీ ఇంజినీర్ సతీశ్ సవానె అంటున్నారు.