Digital Life Certificate : పెన్షనర్లకు గుడ్ న్యూస్.. మీ దగ్గరలోని పోస్టాఫీసులోనే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందొచ్చు!

వృద్ధులు, ఫించనుదారులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఇండియా పోస్టు సెంటర్ల ద్వారా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. సమీపంలోని పోస్టాఫీసు నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ద్వారా జీవన్ ప్రమాన్ సేవలను పొందవచ్చు.

Pensioners Digital Life Certificate : వృద్ధులు, ఫించనుదారులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఇండియా పోస్టు సెంటర్ల ద్వారా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. సమీపంలోని పోస్టాఫీసు నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ద్వారా జీవన్ ప్రమాన్ సేవలను పొందవచ్చు. ఈ మేరకు ఇండియా పోస్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండియా పోస్ట్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ప్రకారం.. సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు సమీప పోస్టాఫీసు CSC కౌంటర్ లో జీవన్ ప్రమాన్ సేవల ప్రయోజనాన్ని సులభంగా పొందవచ్చు. కేంద్ర, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(UTs) 60 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

Jeevanpramaan.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు. పెన్షన్ తీసుకునే వ్యక్తి ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీ ముందు హాజరు కావాలి. పింఛనుదారుడు ఇంతకు ముందు పనిచేసిన అథారిటీ ద్వారా జారీ చేసిన లైఫ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఆ తర్వాత దానిని ఏజెన్సీకి సమర్పించాల్సి ఉంటుంది. లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి సమీప పోస్టాఫీసు కేంద్రాన్ని సందర్శించవచ్చు. మీ దగ్గరలో జీవన్ ప్రమాన్ కేంద్రాలు ఉంటే అక్కడ కూడా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఈ కేంద్రాలలో మీ ఆధార్ బయో మెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది.


అదేవిధంగా ఒక SMS పంపడం ద్వారా లేదా టోల్ ఫ్రీ కాల్ చేయడం ద్వారా అతని లేదా ఆమె సమీప జీవన్ ప్రమాన్ సెంటర్ వివరాలను పొందవచ్చు. JPL అని టైప్ చేసి, మీ మొబైల్ నంబర్ నుంచి 7738299899 కు పంపండి. లేదా 1800 111 555 కు డయల్ చేయండి. పిన్ కోడ్ సమీపంలో ఉన్న జీవన్ ప్రమాన్ కేంద్రాల ఎంపిక పెన్షనర్‌కు పంపడం జరుగుతుంది. ఆ లిస్టులో సమీప కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. పింఛనుదారుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాన్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు