Viral Video : విషాదవార్త చదువుతూ యాంకర్ చేసిన పనికి దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

ఓ టీవీ యాంకర్ ప్రత్యక్ష ప్రసారంలో సీరియస్ వార్తను చదువుతూ తప్పు దొర్లి ఫక్కున నవ్వేసింది. తర్వాత క్షమించమని అడిగినా వీడియో ఫుటేజ్ వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Viral Video

Viral Video : న్యూస్ యాంకర్లు, రిపోర్టర్లు ప్రత్యక్ష ప్రసారంలో చాలా జాగ్రత్తలు వహిస్తారు. కొన్ని సున్నితమైన అంశాలపై రిపోర్ట్ చేస్తున్నప్పుడు మరింత కేర్‌గా ఉంటారు. బీహార్‌కి చెందిన ఓ న్యూస్ యాంకర్ ఓ విషాదకరమైన వార్త చదువుతూ చేసిన పనికి నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?

United States : యాంకర్‌కి లైవ్‌లో ప్రపోజ్ చేసిన రిపోర్టర్.. ఎక్కడంటే?

బీహార్ రాష్ట్రంలో ఓ న్యూస్ ఛానల్‌లో పనిచేస్తున్న యాంకర్ అక్కడ భాగమతి నది కారణంగా పోటెత్తిన వరదల గురించి లైవ్‌లో చదువుతోంది. బీహార్‌లోని ముజఫర్ పూర్ జిల్లాలో సుమారు 30 మంది పిల్లలతో ఉన్న పడవ బోల్తా పడిందని వారిలో 12 మంది ఆచూకీ తెలియట్లేదని తెలిపే వార్తను ప్రెజెంట్ చేస్తోంది. ఓ పదం తప్పుగా పలకడంతో వెంటనే నవ్వేసింది. తేరుకుని లైవ్‌లో క్షమాపణలు కోరింది. అప్పటికే ఎడిట్ చేయని వీడియో ఫుటేజ్ ఆన్ లైన్‌లో కనిపించడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోసారు.

viral video : లైవ్‌లో తడబడిన బీబీసీ యాంకర్.. వైరల్ అవుతున్న వీడియో
@sanjayjourno అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ‘ఇంత ఆనందం ఎందుకు? కారణం చెప్పగలరా..’ అనే శీర్షికతో పోస్ట్ చేసారు. రాష్ట్రంలో తీవ్రమైన సమస్యకు సంబంధించిన వార్తల కవరేజీ విషయాన్నిన్యూస్ రీడర్ హాస్యాస్పదంగా తీసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.