హోలీ వేడుకలు : అంబరాన్నంటుతున్న సంబరాలు

  • Publish Date - March 21, 2019 / 02:27 AM IST

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా గురువారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం కొన్ని ప్రాంతాల్లో సంబరాలుచేసుకుంటే నేడు  దేశమంతా చిన్నాపెద్దా తేడా లేకుండా హోలీ  వేడుకల్లో మునిగిపోయారు. హోలీ పండుగను పురస్కరించుని పలుచోట్ల కామదహనం నిర్వహించారు. పిడకలు, కట్టెలను పేర్చి.. పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని దహనం చేశారు.  హైదరాబాద్‌లో సంప్రదాయబద్దంగా కామదహనం జరిగింది. మంటల చుట్టూ తిరుగుతూ  ప్రజలు పాటలు పాడారు. ప్రజలంతా  ఇవాళ హోలీని జరుపుకుంటున్నారు.

కాగా….. ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి లో 40 మంది జవాన్లు మరణించటంతో  కేంద్ర సాయుధ దళాలు ఈ రోజు జరిగే  హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి.