Heavy Rains And Flood : ఉత్తర భారతంలో భారీ వర్షాలు..వరదలు..విరిగిపడ్డ కొండ చరియలు

ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నీటి ఉదృతికి వంతెనలు ప్రమాదకస్థాయిలో ఉన్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. డెహ్రాడూన్ జిల్లాలో భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న వంతెన ద్వారా అమ్లావా నదిని దాటడానికి ప్రయత్నిస్తున్న ప్రజలు చాలా అప్రమత్తంగా వంతెన దాటడానికి యత్నిస్తున్న వీడియో వైలర్ గా మారింది.

Heavy Rains And Flood (1)

Heavy Rains And Flood :ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల మీదకు వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. నీటి ఉదృతికి వంతెనలు ప్రమాదకస్థాయిలో ఉన్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. డెహ్రాడూన్ జిల్లాలో భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న వంతెన ద్వారా అమ్లావా నదిని దాటడానికి ప్రయత్నిస్తున్న ప్రజలు చాలా అప్రమత్తంగా వంతెన దాటడానికి యత్నిస్తున్న వీడియో వైలర్ గా మారింది.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురుస్తునే ఉన్నాయి. దీంతో వరదలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్రం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను హిమాచల్ ప్రదేశ్‌కు తరలించింది. వరదలకు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో 10 మంది గల్లంతు అయ్యారు. విద్యార్థులతో సహా 100 మందికి పైగా ట్రయండ్ ట్రెక్కింగ్ మార్గం ద్వారా రక్షించారు. కొండచరియలు, వరదలు కారణంగా చండీగఢ్ మనాలి హైవేతో సహా 60 కి పైగా రోడ్లుమూతబడ్డాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, హిమాచల్ ప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలకు అన్ని విధాలా సహకరిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. తీవ్ర వరదలకు బోహ్ వ్యాలీలో 6-7 ఇళ్ళు దెబ్బతిన్నాయి.గల్లంతైన వారికి కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. తప్పిపోయిన 10 మందికి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని హిమాచల్ సిఎం జయరామ్ ఠాకూర్ వెల్లడించారు. ధర్మశాల చైత్రు గ్రామంలో అనేక ఇళ్ళు దెబ్బతిన్నాయి.