Mohan Bhagwat : అందుకే పాకిస్థాన్ ప్రజలు సంతోషంగా లేరు.. మోహన్ భగత్ కీలక వ్యాఖ్యలు

దేశం విభజన తప్పని పాక్ ప్రజలు భావిస్తున్నారని..స్వాతంత్ర్య వచ్చి 70 ఏళ్లు దాటినా పాకిస్థాన్ ప్రజలు సంతోషంగా లేరు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు.

Mohan Bhagwat : స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా పాకిస్థాన్ ప్రజలు సంతోషంగా లేరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగత్ వ్యాఖ్యానించారు. దేశ విభజనను పాకిస్థాన్ ప్రజలు కూడా తప్పుపడతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం భోపాల్ లో విప్లవకారుడు హేము కలానీ జయంతిని పురస్కరించుకుని సింధీలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోహన్ భగత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ విభజన (Partition of India) తప్పని, స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తరువాత కూడా పాక్ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. భారతదేశ విభజన ఓ పీడకలలాంటిదన్నారు. 1947లో (దేశ విభజనకు ముందు) భారత్ నుంచి విడిపోయిన పాకిస్థాన్ ఏమాత్రం అభివృద్ధి చెందలేదని పాక్ ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరని అన్నారు. ఈనాటికీ పాక్ ప్రజలు బాధలు పడతున్నారని అన్నారు. విభజనతో ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతిన్నాయనిఅన్నారు.

ఇతర దేశాలపై దాడులు చేసే సంస్కృతి భారత్ కు లేదని స్పష్టం చేసిన ఆయన.. పాకిస్థాన్(Pakistan) పై భారత్ దాడి చేయాలన్న ఉద్ధేశం తనకు ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. ఏ దేశంతోనూ భారత్ యుద్ధానికి దిగదని.. కానీ ఇతర దేశాలు దాడులకు పాల్పడితే ఆత్మరక్షణ కోసం ప్రతిఘటిస్తుందన్నారు. పొరుగు దేశాలు అకారణంగా దాడికి తెగబడితే భారత్ (India) తగిన బుద్ధి చెబుతుందన్నారు.

Also Read: నాటోలో భారత్ చేరటానికి తలుపులు తెరిచే ఉన్నాయ్: యూఎస్‌ నాటో రాయబారి షాకింగ్‌ కామెంట్స్

ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడుల(surgical strike) గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఆత్మరక్షణ కోసం ప్రతిదాడులతో తగిన బుద్ధి చెప్పాలనేదే భారత్ సంస్కృతి అని స్పష్టం చేశారు. ఇదే భారత్ సంస్కృతి అని దానినే ఆచరిస్తాం, కొనసాగిస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా సింధీ కమ్యూనిటీని మోహన్ భగత్ (Mohan Bhagwat) ప్రశంసించారు.

ట్రెండింగ్ వార్తలు