People S Pain Greater Mamata Banerjee In Wheelchair
west bengal వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీల్‌చైర్‌లో కూర్చొనే ప్రచారం కొనసాగిస్తున్నారు. కారు డోర్ తగలడంతో ఎడమ కాలికి గాయం అవడంతో మూడు రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న మమత..ఆదివారం నుంచి వీల్ చైర్ లో కూర్చొనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సోమవారం పురూలియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మమత…తన బాధ కంటే ప్రజల బాధే ఎక్కువ అని అన్నారు.
గత వారం నందిగ్రామ్ ఘటనలో తనకు జరిగిన గాయాన్ని మమత ప్రస్తావిస్తూ.. ఓ ఘటనలో నేను గాయపడ్డాను. నిజానికి అదృష్టవశాత్తూ జీవించి ఉన్నాను. నా కాలికి పట్టీ ఉంది. నేను నడవలేను. ఈ విరిగిన కాలితో నేను అడుగు కూడా బయటపెట్టలేనని కొందరు అనుకున్నారని అన్నారు. కాలినొప్పి కారణం చూపి ప్రచారాన్ని ఆపనని మమత అన్నారు. ప్రజలు మరోసారి కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే ఆశీర్వించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా బీజేపీపై మమత తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అబద్ధాలు చెప్పి బెంగాల్ లో గెలిచిందన్నారు మమతా. బీజేపీ వాళ్లు అన్నీ అమ్ముతున్నారని మమత విమర్శించారు. తాము అభివృద్ధి చేస్తుంటే బీజేపీ మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేస్తోంది అని మమత విమర్శించారు. కిరోసిన్ కూడా దొరకకుండా చేస్తున్నారని మమత విమర్శించారు. బెంగాల్ లో తమ ప్రభుత్వం 1000రూపాయల వితంతు పెన్షన్ కార్యక్రమాన్ని ప్రకటించిందని మమత తెలిపారు. ద్యురే సర్కార్ పథకం కిద కుల ధృవీకరణ పత్రాలను తాము జారీ చేశామని మమత తెలిపారు.
పశ్చిమబెంగాల్‌లో మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వమే ఉంటుందని, మీకందరికి ఉచితంగా రేషన్ అందజేసే కార్యక్రమం ఎప్పటిలాగే కొనసాగుతుందని ఓటర్లను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. ఇక నుంచి రేషన్ సరుకుల కోసం ప్రజలు చౌక దుకాణాల ముందు లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదని, మే నెల నుంచి లబ్ధిదారుల ఇండ్ల వద్దకే రేషన్ కోటా వస్తుందని ఆమె హామీ ఇచ్చారు.