Crime News: దళితుడితో చెప్పులు నాకించిన వ్యక్తి.. ఆ తర్వాత..

నిందితుడు విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగి తేజ్‌బాలీ సింగ్‌ పటేల్ అని తెలిపారు.

Crime

Crime News – UPs Sonbhadra: దేశంలో దళితులు, గిరిజనులపై తరుచూ ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓ దళితుడితో ఓ వ్యక్తి చెప్పులు నాకించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ (Video Viral) అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని సోన్‌భద్ర జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు.

నిందితుడు విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగి తేజ్‌బాలీ సింగ్‌ పటేల్ అని తెలిపారు. అతడి నిర్వాహం చూసి ఉద్యోగం నుంచి అధికారులు తొలగించారని చెప్పారు. రాజేంద్ర చమర్ అనే దళితుడు ఇటీవల బల్దిహ్ గ్రామంలోని అతడి బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ విద్యుత్తు పోవడంతో దానికిగల కారణాలను తెలుసుకోవడానికి అతడు కరెంట్ ఆఫీస్ వైపుగా వెళ్లాడు.

అతడిని చూసిన తేజ్‌బాలీ సింగ్‌ దాడికి దిగాడు. అనంతతరం తేజ్ చెప్పులను నాకాలని రాజేంద్ర చమర్ ను బెదిరించాడు. ఆ సమయంలో రాజేంద్ర చమర్ కులాన్ని ప్రస్తావిస్తూ దూషిస్తూ కొట్టాడు. ఆ సమయంలో వీడియో కూడా తీయించాడు. స్థానికులు జోక్యం చేసుకుని ఆ దళితుడిని రక్షించారు. తనపై జరిగిన దాడిపై రాజేంద్ర చమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

Patient cheated the doctor : నకిలీ రూ.500 నోటు ఇచ్చి డాక్టర్‌ని మోసం చేసిన పేషెంట్

ట్రెండింగ్ వార్తలు