Delhi : 2 ఏళ్లు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాడు.. రూ.58 లక్షల బిల్లు ఎగ్గొట్టి ఎస్కేప్ అయ్యాడు

సాధారణంగా హోటల్‌లో బస చేస్తే గడువు సమయం దాటితే సిబ్బంది ఎలర్ట్ చేస్తారు. అలాంటిది ఓ వ్యక్తి ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో రెండేళ్లు ఉన్నాడు. రూ.58 లక్షలు బిల్లు చేసి పలాయనం చిత్తగించాడు. ఇప్పుడు మేలుకున్న యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Delhi

Delhi : ఢిల్లిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఓ వ్యక్తి రెండు సంవత్సరాలు బస చేశాడు. చెప్పా పెట్టకుండా పారిపోయాడు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో హెయిర్ స్ట్రెయిట్ చేసుకున్నయువతి వీడియో వైరల్ .. తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి సమీపంలోని ఏరోసిటీలో ‘రోసెట్ హౌస్’ అనే హోటల్ ఉంది. అంకుష్ దత్తా అనే వ్యక్తి 603 రోజుల పాటు ఈ హోటల్‌లో బసచేశాడు. ఇన్ని రోజులకు అతనికి అయిన ఖర్చు అక్షరాల రూ.58 లక్షల రూపాయలట. అంత మొత్తం ఎగ్గొట్టి అతగాడు పరారయ్యాడు. మే 30, 2019 లో దత్తా హోటల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడట. మరుసటి రోజు చెక్ అవుట్ అవ్వాల్సి ఉంది. అయితే వాయిదా వేస్తూనే ఉన్నాడని హోటల్ యాజమాన్యం ఆరోపిస్తోంది. జనవరి 22, 2021 వరకు గడువు తేదీగా కాగా అతను హోటల్ రూంను ఖాళీ చేయలేదు. గడువు సమయం 72 గంటలు దాటితే ఫైనాన్షియల్ కంట్రోలర్ లేదా CEO దృష్టికి అక్కడ పనిచేసే సంబంధిత సిబ్బంది ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రకాష్ అనే సిబ్బంది ఒకరు దత్తాతో కుమ్మక్కై ఎటువంటి సమాచారం ఇవ్వలేదట.

Adipurush : ఢిల్లీ హైకోర్టులో ఆదిపురుష్‌ పై పిటిషన్.. రామయాణాన్ని హేళన చేశారంటూ హిందూసేన అధ్యక్షుడు!

ఇక దత్తా అక్కడ ఇంతకాలం ఉండేందుకు సిబ్బంది ప్రకాష్ అతనికి సహకరించాడని ఇతర అతిథులు చేసిన చెల్లింపులు దత్తా చేసినట్లు రికార్డులలో చూపించాడని చెబుతున్నారు. దత్తా అతనికి సహకరించిన ప్రకాష్ ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలిన హోటల్ యాజమాన్యం డిమాండ్ చేస్తోంది. నేరం జరిగినట్లు ఐజీఐ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.