Petrol Bomb
Petrol Bomb: ఎస్‌ఐ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబ్ విసిరారు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లా తిరువణ్ణామలై చోటుచేసుకుంది. తిరువణ్ణామలై తూర్పు డివిజన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ సుందర్, మత్తలకులం వీధిలో నివాసం ఉంటున్నాడు. శనివారం డ్యూటీ దిగి వచ్చిన ఎస్ఐ తన బైక్ ఇంటి ముందు పార్క్ చేశాడు.
శనివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఎస్ఐ ఇంటిపై పెట్రోల్ బాంబ్ విసిరారు. దీంతో పార్కింగ్ లో ఉన్న కారు, బైకు కాలిపోయాయి. మంటలను గమనించిన స్థానికులు అదుపు చేశారు. ఇక ఈ ఘటనపై ఎస్ఐ సుందర్ తూర్పు డివిజన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అయితే పాత కక్షల కారణంగానే ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.