Petrol-Diesel Prices : మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు ఎంతంటే?

ఒకవైపు కరోనా.. మరోవైపు ఇంధన ధరలు అమాంత పెరిగిపోతున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు కూడా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీట‌ర్ పెట్రోలుపై రూ.25పైస‌లు, డీజిల్ రూ.30 పైస‌లు చొప్పున పెంచాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు.

Petrol and Diesel Prices hike : ఒకవైపు కరోనా.. మరోవైపు ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు కూడా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీట‌ర్ పెట్రోలుపై రూ.25పైస‌లు, డీజిల్ రూ.30 పైస‌లు చొప్పున పెంచాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.90.99గా ఉండగా.. డీజిల్‌ లీటర్ ధర రూ.81.42కు చేరింది. అలాగే ముంబైలో పెట్రోల్ రూ.97.34 ఉండగా, డీజిల్‌ రూ.88.49గా ఉంది.

చెన్నైలో పెట్రోల్‌ రూ.92.90 ఉండగా, డీజిల్‌ రూ.86.35గా నిర్ణయించాయి. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.14, డీజిల్‌ రూ.84.26గా ఉంది. అలాగే బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.01, డీజిల్‌ రూ.86.31గా నిర్ణయించాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.94.57 ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.77గా ఉంది.

ఏపీలో అమరావతిలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.97.14గా ఉండగా.. డీజిల్‌ రూ.90.79 ధర పలుకుతోంది. అలాగే విశాఖపట్టణంలో పెట్రోల్‌ లీటర్ కు ధర రూ.95.90, డీజిల్‌ ధర రూ.89.59గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ లీటర్ ధర రూ .96.72గా నిర్ణయించగా.. డీజిల్‌ లీటర్ ధర రూ. 90.41వరకు పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు