Petrol
petrol and diesel prices Rising : దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కన్పిస్తున్నాయి. అయితే మెట్రో నగరాల్లో కొద్ది రోజులపాటు స్థిరంగా కొనసాగిన ధరలు ఇప్పుడు పంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలోని చాలా నగరాల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డిజిల్ పై 30 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.64, డీజిల్ రూ.91.07, హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై 26పైసలు, డీజిల్ పై 33 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలో రూ.106.77, డీజిల్ రూ.99.37.
Mumbai Ship Drugs : ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు.. బిట్ కాయిన్స్ ద్వారా కొనుగోళ్లు?
ముంబైలో పెట్రోల్ రూ. 108.67, డీజిల్ రూ .98.80, కోల్‌కతాలో పెట్రోల్ రూ. 103.36, డీజిల్ రూ. 94.17 పెరిగింది. చెన్నైలో పెట్రోల్ రూ .100.23, డీజిల్ రూ. 95.59 పెరిగింది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.106.21, డీజిల్ ధర రూ.96.66గా ఉంది. లక్నోలో పెట్రోల్ ధర రూ. 99.54, డీజిల్ ధర రూ.91.33గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ ధర రూ. 106.94, డీజిల్ ధర రూ.99.52గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 107.46, డీజిల్ ధర రూ. 99.98గా ఉంది. మెదక్‌లో పెట్రోల్ ధర రూ.107.21, డీజిల్ ధర రూ.99.77గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో పెట్రోల్ ధర రూ. 107.15, డీజిల్ ధర రూ.99.72గా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ ధర రూ. 106.29, డీజిల్ ధర రూ.98.91గా ఉంది.
Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. నాలుగు రోజుల్లో మూడోసారి!
విజయవాడలో పెట్రోల్ రూ.109.26, డీజిల్ ధర రూ.101.28గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.94, డీజిల్ ధర రూ. 100గా ఉంది. విజయనగరంలో పెట్రోల్ ధర రూ. 109.05, డీజిల్ ధర రూ.101.03గా ఉంది. గుంటూరు జిల్లాలో పెట్రోల్ రూ. 109.26, డీజిల్ రూ.101.28గా ఉంది. కృష్ణా జిల్లాలో పెట్రోల్ ధర రూ. 108.77, డీజిల్ ధర రూ.100.82గా ఉంది.