Petrol Rate : స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు

పెట్రల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో ఫ్యూయల్ ధరల్లో ఎటువంటి మార్పులు జరగలేదు.

Petrol Rate : పెట్రల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో ఫ్యూయల్ ధరల్లో ఎటువంటి మార్పులు జరగలేదు. ఇక ఇప్పటికి చాలా నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100పైనే ఉంది. త్వరలో ఫ్యూయల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంపై నిర్ణయం తీసుకోవాలని జూన్‌లో కేరళ హైకోర్టు జీఎస్టీ మండలిని కోరింది. ఈ నేపథ్యంలో మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాల జాబితాలో ఈ ప్రతిపాదనను కూడా చేర్చారు. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీలోకి తీసుకొస్తే ధరలు చాలావరకు తగ్గే అవకాశం ఉంది.

Read More : Petrol : ఆ పెట్రోల్ బంక్ లో.. లీటర్ పెట్రోల్ ఉచితం

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.88.62 గా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.26గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.96గా ఉండగా డీజిల్ ధర రూ. 93.26 గా ఉంది.
కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.62 డీజిల్ లీటర్ ధర రూ.91.71గా ఉంది.

Read More : PV Sindhu Biopic: దీపికా మరో క్రేజీ ఫిల్మ్.. సిల్వర్ స్క్రీన్ మీద సింధు సక్సెస్ స్టోరీ!

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.26గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.69గా ఉంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉండగా.. డీజిల్ ధర రూ. 98.34గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు