Petrol-Diesel Price: మే నెలలో 13రోజులు.. మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

Petrol-Diesel Price Today: ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ రోజు (మంగళవారం) పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 23 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 27 పైసల వరకూ పెంచాయి.

పెరిగిన ధరలతో ఢిల్లీలో ఈరోజు అంటే మంగళవారం(మే 25) పెట్రోల్ ధర రూ. 93.44గా ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ .84.32గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 99.71గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ. 91.57కు చేరుకుంది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.93.49, డీజిల్‌ రూ.87.16, చెన్నైలో పెట్రోల్‌ రూ.93.49, డీజిల్‌ 87,16కు చేరాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.97.12, డీజిల్‌ రూ.91.92గా ఉంది. 2021, మే 24, సోమవారం, వారంలో మొదటి రోజు, చమురు కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు.

మే నెలలో ఇప్పటివరకు చమురు ధరను 13 రోజులుగా పెంచుతున్నారు. పెట్రోల్-డీజిల్ రికార్డు స్థాయికి చేరుకుంది. ముంబైలో పెట్రోల్ 100కి చేరుకుంది. అదే సమయంలో, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకింది. రూ .100 దాటింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చిత్తూరు జిల్లాలో రూ.100 దాటింది.

ట్రెండింగ్ వార్తలు