Room Rent : అద్దెకు రెడీగా ఉన్న రూమ్.. రెంట్ ఎంత ఇవ్వచ్చో వివరాలు చదివి చెప్పండి..

చిన్న గదిలో అన్ని సౌకర్యాలతో ఢిల్లీలో అద్దెకు రూమ్ రెడీగా ఉంది. అంతా బాగానే ఉంది కానీ.. అదే రూమ్‌లో బాత్రూం ఏంటని నెటిజన్లు పెదవి విరిచారు. ఈ రూమ్‌కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Delhi

Room Rent : చిన్న గది.. గ్రీన్ కలర్ వాల్.. టేబుల్ ఫ్యాన్.. చిన్న మంచం ఇంకా గదిలో షవర్ బాత్ చేసేందుకు చిన్న బాత్రూం.. పక్కనే వెస్ట్రన్ కమోడ్.. ఢిల్లీలో ఈ సౌకర్యాలతో రెంట్‌కి రూం రెడీగా ఉంది.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్

ఓ చిన్న గది ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఈ గది ఉందట. ఈ విషయం రెడ్డిట్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. దీనిని పోస్ట్ చేసిన వ్యక్తి దీనికి ఎంత అద్దె చెల్లిస్తారో చెబుతారా? అంటూ నెటిజన్లను అడిగాడు. గది చిన్నదే అయినా ఫోటోలో టేబుల్ ఫ్యాన్, చిన్న మంచం ఉన్నాయి. గదికి ఎయిర్ కండిషన్ కూడా ఉందండోయ్. అయితే అదే గదిలో బాత్రూం ఉండటం అందరినీ కాస్త అయోమయంలో పడేసింది. ఫోటోలో షవర్ క్యూబికల్, వెస్ట్రన్ కమోడ్ కూడా కనిపించాయి.

Yamuna River : ఢిల్లీలో మళ్లీ డేంజర్ మార్కుకు చేరిన యమునా నది

‘అది మంచంతో కూడిన టాయలెట్’ అని.. ‘సౌకర్యాలతో కూడిన జైలు’  అని నెటిజన్లు కామెంట్లు చేశారు. గ్రేటర్ కైలాష్ ప్రాంతం అంటే పెద్ద పెద్ద బంగ్లాలకు ప్రసిద్ధి. అక్కడ అద్దెలు బాగానే ధర పలకొచ్చు. ఈ లెక్కన ఇష్టపడే వారు ఆ రూమ్ అద్దెకు తీసుకోవాలంటే రెంట్ బాగానే ఉండొచ్చు.