Pit bull Dog Attacks : బాబోయ్.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కొరికేసిన కుక్క, కొట్టి చంపిన జనం

Pit bull Dog : ఓ కుక్క రెచ్చిపోయింది. ఓ యువకుడి పై దాడి చేసి అతడి ప్రైవేట్ పార్ట్ కొరికేసింది. కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు తీవ్రంగా శ్రమించాడు.

Pit bull Dog Attacks : వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వెంటపడి, మీదపడి భీకరంగా దాడులు చేస్తున్నాయి. రోడ్డు మీద ఒంటరిగా కనిపిస్తే చాలు రౌండప్ చేసి కరుస్తున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో దాడి చేసి ప్రాణాలు కూడా తీస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొన్ని రోజులుగా శునకాల దాడులు పెరిగిపోయాయి. దీంతో జనం రోడ్డు మీదకు రావాలంటేనే హడలిపోతున్నారు. కుక్క కనిపిస్తే చాలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.

తాజాగా మరో దారుణం జరిగింది. ఓ కుక్క రెచ్చిపోయింది. ఓ యువకుడి పై దాడి చేసి అతడి ప్రైవేట్ పార్ట్ కొరికేసింది. ఈ షాకింగ్ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.(Pit bull Dog Attacks)

Also Read..Uttar Pradesh: వీధి కుక్కల భీకర దాడి.. తీవ్రగాయాలతో 11 ఏళ్ల బాలుడి మృతి

కర్నాల్ లో పిట్ బుల్ జాతికి చెందిన కుక్క ఓ యువకుడి(30)పై దాడి చేసింది. ఏకంగా అతడి ప్రైవేట్ పార్ట్ ని కొరికేసింది. కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు తీవ్రంగా శ్రమించాడు. కుక్క నోట్లో క్లాత్ పెట్టాడు. అయినా అది వదల్లేదు. చివరికి స్థానికులు వచ్చి ఆ కుక్కను కర్రలతో కొట్టి చంపాల్సి వచ్చింది.

బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడికి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. కాగా, చాలా దేశాల్లో పిట్ బుల్ జాతికి చెందిన కుక్కలు అత్యంత ప్రమాదకరమైనవిగా భావిస్తారు.

కర్నాల్‌లోని బిజ్నా గ్రామానికి చెందిన 30 ఏళ్ల కరణ్ గురువారం ఉదయం తన పొలంలో పని చేస్తున్నాడు. గోధుమ గడ్డిని తయారు చేయడానికి ఉపయోగించే రీపర్ యంత్రం పొలంలో ఉంది. దాని కిందే ఈ పిట్‌బుల్ కుక్క కూర్చుని ఉంది. కరణ్ మెషీన్ దగ్గరికి చేరుకోగానే, పిట్‌బుల్ కుక్క వెంటనే అతని ప్రైవేట్ పార్ట్‌పై దాడి చేసింది. ఎంత ప్రయత్నించినా, పిట్‌బుల్ యువకుడి ప్రైవేట్ భాగాన్ని వదిల్లేదు. దాంతో కరణ్.. తనకు దగ్గరలో ఉన్న గుడ్డను కుక్క నోటిలో వేశాడు. చాలా సేపటి ప్రయత్నం తర్వాత కుక్కను వదిలించుకున్నాడు. అయితే అప్పటికే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

బాధితుడి అరుపులు విన్న చుట్టుపక్కల వారు పరుగున అక్కడికి వచ్చారు. వెంటనే అతడిని స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నాల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు కొన్ని గంటలపాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది. అయితే, అతడి పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Also Read..Alcoholic Dog : యజమాని మరణం, మద్యానికి బానిసైన కుక్క

దాడి చేసిన పిట్ బుల్ జాతి కుక్క.. గత వారం రోజులుగా గ్రామంలో సంచరిస్తోందని బాధితుడి బంధువులు తెలిపారు. 2 రోజుల క్రితం కూడా ఓ వ్యక్తిపై దాడి చేసిందన్నారు. ఇప్పుడు మరోసారి భీకర దాడితో గ్రామస్తులు భయంతో వణికిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులంతా తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆ కుక్కను చంపేయాలని డిసైడ్ అయ్యారు. అంతే, కర్రలతో కొట్టి చంపేశారు.

ఆ కుక్క గ్రామానికి చెందిన వ్యక్తిదని గ్రామస్తులు చెప్పారు. ఈ విషయమై సదర్ పోలీస్ స్టేషన్ పోలీసులకు కూడా సమాచారం అందించారు.కుక్క విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ యువకుడి ప్రాణాపాయ స్థితికి కారణమైన శునకం యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు