బడ్జెట్ 2019 : పార్లమెంట్ కు చేరుకున్న బడ్జెట్ కాపీలు

మరికాసేపట్లో ఓటాన్ అకౌంట్  బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలో ఇవాళ(ఫిబ్రవరి-1) ఉదయం 10 గంటలకు కేంద్రమంత్రి వర్గం సమావేశం కానుంది.  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్య కారణాలతో అమెరికాలో ట్రీట్మెంట్ పొందుతున్న కారణంగా తాత్కాలిక ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న పియూష్ గోయల్ ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ 2019 కాపీలు ఇప్పటికే పార్లమెంట్ కాంప్లెక్స్ కి చేరుకున్నాయి.