Haryana: భయానక పరిస్థితులకు వణికిపోయి.. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ సొంత ప్రాంతానికి..

తమ వస్తువులు అన్నీ సర్దుకుని రోడ్లపై నడుస్తూ తమ రాష్ట్రాలకు వెళ్తూ కనపడుతున్నారు.

Panicked migrants leaving Nuh Gurugram

Haryana – Violence: హరియాణలో చెలరేగిన హింస కారణంగా వలస కార్మికులు భయంతో తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. సొంత గ్రామాల్లో ఉంటేనే సురక్షితంగా ఉండవచ్చని భావిస్తున్నారు. నూహ్ (Nuh) జిల్లాలో ఇటీవల రెండు వర్గాల మధ్య హింస చెలరేగిన విషయం తెలిసిందే. విధ్వంసం వల్ల ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

గురుగ్రాం, నోహ్ కు పని కోసం వచ్చిన కూలీలు, డ్రైవర్లు, చిరు వ్యాపారులు తమ సొంత రాష్ట్రాలకు క్యూ కట్టారు. హరియాణలో పారామిలటరీ దళాలు మోహరించినప్పటికీ, భద్రత కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వలస కార్మికులు ఆ రాష్ట్రంలో ఉండడానికి అంగీకరించడం లేదు.

తమ వస్తువులు అన్నీ సర్దుకుని రోడ్లపై నడుస్తూ తమ రాష్ట్రాలకు వెళ్తూ కనపడుతున్నారు. అధికారుల నిబంధనలతో సమస్యాత్మక ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు అందుబాటులో లేవు. అయినప్పటికీ, తమ వద్ద వేరే మార్గం లేదని, ఇక్కడ సురక్షితంగా ఉండలేమని భావిస్తున్నామని కార్మికులు అంటున్నారు.

నూహ్ లో తాను కొన్ని నెలలుగా ఉంటున్నానని, ఇప్పుడు భయంతో ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్తున్నానని జగదీశ్ అనే కార్మికుడు మీడియాకు తెలిపాడు. మంగళవారం రాత్రి నుంచి చాలా మంది సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దాదాపు 400 కుటుంబాలు నూహ్ నుంచి వెళ్లిపోతున్నాయని జగదీశ్ చెప్పాడు. తమకు వాహన సదుపాయం కల్పించి, ఢిల్లీకి చేర్చాలని వేడుకుంటూ ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది.

Viral Video: మరీ ఇంత ఉన్మాదమా? ఎన్‭సీసీ క్యాడెట్లను దారుణంగా కొట్టిన సీనియర్.. వీడియో చూస్తే షాక్ అవుతారు