PM modi dedicates frontline naval combatants INS Surat INS Nilgiri and INS Vagsheer to the nation
PM Modi: అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ లను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ముంబయిలోని నేవల్ డాక్ యార్డ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మోదీ పాల్గొన్నారు. యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. వీటి రాకతో నౌకదళ బలం మరింత పటిష్టం కానుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నౌకాదళం బలోపేతానికి నేడు మరో ముందడుగు పడిందన్నారు. రెండు యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఒకేసారి ప్రారంభించామని, ఇవన్నీ భారత్ లో తయారైనవేనని, వీటితో నౌకాదళానికి నూతన బలం, దార్శనికత అందుతుందని వివరించారు.