PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి.. ఇలా చెక్‌ చేసుకోండి..

అర్హత ఉన్న రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 పొందుతారు.

దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్‌ నిధులు ఇవాళ విడుదలయ్యాయి. బిహార్‌లోని భగల్పూర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని కిసాన్ పథక 19వ విడత నిధులను విడుదల చేశారు. రూ.22,000 కోట్ల మొత్తాన్ని నేరుగా నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేశారు.

ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోనే నిధుల జమ చేస్తారన్న విషయం తెలిసిందే. ప్రధాని కిసాన్ పథకం ప్రకారం, అర్హత ఉన్న రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 పొందుతారు. అంటే సంవత్సరానికి రూ.6,000 అందుతాయి. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ఈ డబ్బును ప్రతి సంవత్సరం మూడు వాయిదాలలో అందిస్తారు.

ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చిలో ఈ డబ్బు అందుతుంది. తాజాగా విడుదల చేసిన డబ్బు 9.7 కోట్ల మంది రైతులకు చేరుతుంది. ఈ పథకాన్ని కేంద్ర సర్కారు 2019 ఫిబ్రవరి 24 నుంచి అమలు చేస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 11 కోట్ల మందికి మొత్తం 18 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లు జమచేసింది.

Also Read: వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్.. మూడు రోజుల కస్టడీ

స్టేటస్‌ ఇలా చూసుకోండి…
అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయండి
పేజీ కుడి వైపున ఉన్న స్టేటస్‌ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, కాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి, గెట్‌ డేలాపై క్లిక్ చేయండి
లబ్ధిదారుని స్టేటస్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది

మీ పేరును ఇలా చూసుకోండి
www.pmkisan.gov.in ఓపెన్ చేయండి
‘లబ్ధిదారుల జాబితా’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామం వంటి డ్రాప్-డౌన్ మెను నుంచి వివరాలను ఎంచుకోండి
‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
లబ్ధిదారుల జాబితా వస్తుంది

ఈ హెల్ప్‌లైన్ నంబర్‌లకు కూడా కాల్ చేయవచ్చు 155261, 011-24300606

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే?
pmkisan.gov.in ని ఓపెన్ చేయండి
‘కొత్త రైతు రిజిస్ట్రేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చాను ఎంటర్ చేయండి
అవసరమైన వివరాలను నమోదు చేసి, ‘ఎస్‌’ పై క్లిక్ చేయండి.
పీఎం-కిసాన్ దరఖాస్తు ఫామ్-2024లో అడిగిన సమాచారాన్ని ఇవ్వండి
దానిని సేవ్ చేయండి
ఓ ప్రింటవుట్ తీసుకోండి