Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్.. మూడు రోజుల కస్టడీ

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలంటూ ఆదేశించింది.

Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్.. మూడు రోజుల కస్టడీ

Vallabhaneni Vamsi

Updated On : February 24, 2025 / 3:49 PM IST

వైసీపీ నేత వల్లభనేని వంశీని మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. వెన్నుపూస నొప్పి కారణంగా ఇబ్బంది పెడుతున్నానంటూ వంశీ వేసి పిటిషన్ పై కోర్టు స్పందించింది. బెడ్‌కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలంటూ ఆదేశించింది. విజయవాడ లిమిట్స్ లోనే కస్టడీలోకి తీసుకొని విచారించాలని చెప్పింది. అలాగే, న్యాయవాది సమక్షంలోనే విచారించాలని తెలిపింది.

Also Read: ఆకాశంలో అద్భుతం జరగనుంది.. చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ఏ సమయానికి చూడాలంటే?

కాగా, వంశీని విజయవాడ పటమట పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఆయనను అప్పట్లో ఏపీ పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తీసుకెళ్లారు. ఆయనపై పలు కేసులు ఉన్నాయి. గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులోనూ వంశీ ఉన్నారు.

ఇటీవలే వంశీ కస్టడీతో పాటు హెల్త్‌ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరిగాయి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. వంశీ విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నారు.