ఆకాశంలో అద్భుతం జరగనుంది.. చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ఏ సమయానికి చూడాలంటే?

బైనాక్యులర్స్, టెలిస్కోప్ లేకుండానే మనం కళ్లతో చూడొచ్చు.

ఆకాశంలో అద్భుతం జరగనుంది.. చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ఏ సమయానికి చూడాలంటే?

Seven planets

Updated On : February 24, 2025 / 3:24 PM IST

ఆకాశంలో ఏడు గ్రహాలను ఒకేసారి మన కళ్లతో చూసే అవకాశం వస్తోంది. ఈ నెల 28న బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్‌లు ఆకాశంలో ఒకే వరుసలో కనపడనున్నాయి. మన సౌర వ్యవస్థలోని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయన్న విషయం తెలిసిందే.

సూర్యుడికి బుధుడు అత్యంత సమీపంలో ఉంటాడు. గ్రహాలు అన్ని వేర్వేరు వేగంతో సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. దీంతో కొన్ని గ్రహాలు అరుదుగా ఒక దిశలో, వరుసగా వస్తుంటాయి. ఇటువంటిదే ఈ నెల 28న జరగనుంది. ప్లానెటరీ పరేడ్‌గా దీన్ని పిలుస్తారు.

Also Read: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఎన్నికలు ఎప్పుడో తెలుసా?

భారత్‌లో ఏ సమయంలో చూడొచ్చు?
భారత్‌లో ఈ నెల 28న సూర్యాస్తమయం తర్వాత ఆ ఏడు గ్రహాలు ఒకే వరుసలో రావడాన్ని చూడొచ్చు. సూర్యాస్తమయం తర్వాత సుమారు 45 నిమిషాల అనంతరం ఆకాశం వైపుగా చూడాలి. గ్రహాలు కనిపించేలా ఆకాశం చీకటిగా ఉన్నప్పుడు అవి కనపడతాయి. స్పష్టంగా కనపడాలంటే కొంత కాంతి, కాలుష్యం లేని ప్రదేశం నుంచి చూడాలి.

బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్‌లో బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను బైనాక్యులర్స్, టెలిస్కోప్ లేకుండానే మనం కళ్లతో చూడొచ్చు. యురేనస్, నెప్ట్యూన్‌ను చూడాలంటే మాత్రం బైనాక్యులర్స్ వంటివి వాడాల్సిందే.

మహా కుంభమేళా 2025 ముగుస్తున్న సమయంలోనే ఈ గ్రహ పరేడ్ వస్తుండడం గమనార్హం. మహా కుంభమేళా 2025కు ఆధ్యాత్మికతను మరింత పెంచేలా ఆకాశంలో ఈ అద్భుతం జరుగుతుందని కొందరు అంటున్నారు. విశ్వంలో జరిగే ఇటువంటి ఘటనలు ఆధ్యాత్మిక శక్తిని, చైతన్యాన్ని పెంచుతాయని చాలా మంది విశ్వసిస్తారు. గ్రహాలు ఒకే లైన్‌లోకి వస్తుండడం, వాటిని చూసే అవకాశం కూడా రావడం ఓ అద్భుతంగానే చెప్పవచ్చు.