ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎన్నికలు ఎప్పుడో తెలుసా?
మార్చి 29న పది మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.

MLC elections
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనుంది. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3న జారీ కానుంది.
నామినేషన్ల ప్రక్రియ మార్చి 10 నుంచి ప్రారంభ అవుతుంది. నామినేషన్ల పరిశీలన మార్చి 11న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు మార్చి 13. మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు పోలింగ్ తర్వాత
ఓట్ల లెక్కింపు ఉంటుంది. మార్చి 29న పది మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.
పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీలు
- జంగా కృష్ణమూర్తి
- పర్చూరి అశోక్ బాబు
- దువ్వారపు రామారావు
- బి.తిరుమల నాయుడు
- యనమల రామకృష్ణుడు
తెలంగాణలో పదవీకాలం ముగియనున్న వారు
- మహమూద్ అలీ
- సత్యవతి రాథోడ్
- శేరి సుభాష్‌రెడ్డి
- ఎగ్గె మల్లేశం
- మీర్జా రియాజుల్ హాసన్