Indian Hockey Team On Winning Tokyo Olympics
indian hockey team winnig in tokyo olympics : టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టుకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు అభినందనలు తెలిపారు. భారత హాకీ జట్టు సాధించిన విజయం యువతకు ఆదర్శమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఒలింపిక్స్‌లో ఆ జట్టు అసాధారణ ప్రతిభ కనబరిచిందని ప్రశంసించారు. చారిత్రక విజయంతో హాకీలో కొత్త శకానికి నాంది పలికిందని అన్నారు.
భారత హాకీ జట్టును చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోడీ అన్నారు. దేశానికి కాంస్యం అందించిన హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. ఈ విజయం భారతీయులకు మరపురాని రోజని..యువతకు స్ఫూర్తి కలిగించే విజయాన్ని అందించారని పేర్కొన్నారు. 41 ఏళ్ల తర్వాత భారత్ హాకీ జట్టుకు విశ్వక్రీడల్లో మన్‌ప్రీత్ సింగ్ సేన పతకం అందించడంతో అమృత్‌సర్ లోని ఆయన నివాసం వద్ద కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. జర్మనీతో హోరాహోరీగా తలపడిన భారత్ చివరి క్వార్టర్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత ఆటగాళ్లు
దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి.
#WATCH | Punjab: Family members of hockey player Gurjant Singh in Amritsar celebrate the victory of Team India's match against Germany.
India won #Bronze medal in Men's Hockey in #TokyoOlympics. This is India's first Olympic medal in hockey after 41 years. pic.twitter.com/tgmXaXMVsZ
— ANI (@ANI) August 5, 2021
కాగా.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 5-4తో విజయం సాధించి 41 సంవత్సరాల తర్వాత దేశానికి కాంస్య పతకాన్ని అందించింది. తొలి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరికి భారత జట్టు విజయం సాధించింది. మ్యాచ్ చివరి క్వార్టర్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. జర్మనీ నాలుగు గోల్స్ సాధించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.
ఈక్రమంలో భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో జర్మనీకి మరో గోల్ దక్కకుండా జాగ్రత్తగా పడ్డారు. టోక్యోలో భారత జట్టు విజయం సాధించిన వెంటనే దేశంలో సంబరాలు మిన్నంటాయి. చారిత్రక విజయాన్ని అందించిన మన్‌ప్రీత్ సింగ్ సేనపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు, ఓడిన జర్మనీ ఆటగాళ్లు మైదానంలోనే కుప్పకూలి విలపించగా, ఆనందంతో భారత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టారు.
Historic! A day that will be etched in the memory of every Indian.
Congratulations to our Men’s Hockey Team for bringing home the Bronze. With this feat, they have captured the imagination of the entire nation, especially our youth. India is proud of our Hockey team. ?
— Narendra Modi (@narendramodi) August 5, 2021
Congratulations to our men’s hockey team for winning an Olympic Medal in hockey after 41 years. The team showed exceptional skills, resilience & determination to win. This historic victory will start a new era in hockey and will inspire the youth to take up and excel in the sport
— President of India (@rashtrapatibhvn) August 5, 2021