ఇకపై అతిపెద్ద సవాల్ అదే…సీఎంలతో వీడియోకాన్ఫరెన్స్ లో మోడీ

లాక్ డౌన్ ఎత్తివేత స్ట్రాటజీపై ఇవాళ(మే-11,2020) రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించబడినప్పటినుంచి సీఎంలతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం ఇది 5వసారి. ప్రస్తుత పరిస్థితులపై మోడీ సీఎంలతో మాట్లాడారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో ఆర్థిక కలాపాలు మెరుగైనట్లు మోడీ ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్-19 మహమ్మారిని హ్యాండిల్ చేయడంలో భారత్ విజయాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసించాయన్నారు. ఈ పోరాటంలో ప్రధాన పాత్రను రాష్ట్ర ప్రభుత్వాలే పోషించాయన్నారు. రాష్ట్రాలు తమ బాధ్యతలేమిటో గుర్తించి అందుకు అనుగుణంగా వ్యవహరించాయని మోడీ ప్రశంసించారు.

కరోనాపై పోరాటంపై ఇప్పుడు ఎక్కువ దృష్టిపెట్టాల్సి ఉందని మనం రియలైజ్ అవ్వాలని మోడీ తెలిపారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం విధించిన లాక్‌డౌన్‌ను క్రమేణ సడలించాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులను సూచించారు. క్రమంగా లాకౌడౌన్‌‌ను ఎత్తివేయడంలో భాగంగా సడలింపులపై దష్టి పెట్టాలని ఆయన చెప్పినట్లు సమాచారం.

తమవారికి దూరంగా ఉంటున్న ప్రతి ఒక్కరికి తమ ఇళ్లకు వెళ్లాలని ఉంటుంది. అది మానవ నైజం. అందుకని నిర్ణయాలను సవరించుకోవాల్సి లేదా మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. లాక్ డౌన్ నుంచి సడలింపులు ఉన్నప్పటికీ ఈ వైరస్‌ గ్రామాలకుకు సోకకుండా చూడటమే ఇప్పుడు అతిపెద్ద సవాల్ అని వలస కార్మికులను దష్టిలో పెట్టుకొని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.