Happy New Year
PM Modi: కొత్త సంవత్సరం 2022 సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. 2021 డిసెంబర్ 31 అర్ధరాత్రికి ముందు నుంచే ఆ క్షణాల కోసం ఎదురుచూసి తేదీ మారగానే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దేశ ప్రజలకు ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
”ఈ సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలి. మనం అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తూనే ఉంటాం. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చడానికి మరింత కష్టపడి పని చేద్దాం”
– నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
”కొత్త సంవత్సరం కొత్త ప్రారంభానికి సమయం. జీవితంలో కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి, కొత్త తీర్మానాలు చేయడానికి ఇది సమయం. దయ, శ్రద్ధగల మానవులుగా ఉండాలని సంకల్పిద్దాం”
– వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతి
ఇది కూడా చదవండి : ఈ సంవత్సరం సమంత ఎలా ఉండాలనుకుంటుందో తెలుసా..