మూడోదశ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల మాత్రమే మిగిలి ఉన్న సమయంలో రాజకీయ నాయకలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. శనివారం(ఏప్రిల్-20,2019) బీహార్ లోని సపౌల్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు.సపౌల్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read : ఎన్నికల కోడ్ ఒక్క APలోనే ఉందా? – లోకేష్ ట్వీట్
అనిల్ అంబానీకి మాత్రమే మోడీ చౌకీదార్ గా ఉన్నారని…దేశ ప్రజలకు కాదని విమర్శించారు.దేశవ్యాప్తంగా చౌకీదార్ లుగా పనిచేస్తున్న బీహార్ ప్రజల ఇమేజ్ ను మోడీజీ అపఖ్యాతిపాలు చేశారన్నారు.అంతుకుముందు బీహార్ లోని అరారియాలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ ను శిక్షించడానికి బదులుగా హిందువులకు టెర్రరిస్ట్ ట్యాగ్ తగిలించే పనిలో కాంగ్రెస్ బిజీగా ఉందని ఆరోపించారు.
Also Read : పీజీ చేయకుండా రాహుల్ ఎంఫిల్ ఎలా చేస్తారు : జీవీఎల్ క్వశ్చన్స్