ట్రంప్‌ని లైట్ తీసుకున్న మోదీ..? నాలుగు సార్లు కాల్ చేస్తే కూడా..

ట్రంప్ కాల్‌ను మోదీ లిఫ్ట్ చేయలేదని, అమెరికా అధ్యక్షుడి చేష్టలు తమకు ఇబ్బంది కలిగిస్తున్నాయనే సంకేతాలు పంపేందుకే అలా చేశారని ఆ పేపర్‌లో రాశారు.

PM Modi Trump calls

PM Modi Trump calls: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని లైట్ తీసుకున్నారా? లేకపోతే ట్రంప్ విధిస్తున్న టారిఫ్ లకు సింబాలిక్ గా నిరసన తెలిపారా? దీనికి సంబంధించి ఓ కొత్త అంశం వెలుగులోకి వచ్చింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి నాలుగు సార్లు కాల్ చేస్తే కూడా ఆయన ఆన్సర్ చేయలేదని తెలుస్తోంది. ఈ మేరకు ఓ రిపోర్ట్ బయటకు వచ్చింది. (PM Modi Trump calls)

ట్రంప్ కాల్ చేస్తే మోదీ పట్టించుకోలేదని జర్మనీకి చెందిన ఫ్రాంక్ ఫర్టర్ అల్జిమైన్ జీతంగ్ పత్రిక రిపోర్ట్ చేసింది. అదే టైమ్ లో జపాన్ చెందిన మరో పేపర్ కూడా ఇలాంటి వార్తనే ప్రచురించింది. మోదీ ఆన్సర్ చేయకపోవడంతో ట్రంప్ ఫ్రస్ట్రేషన్ లో మరింత పెరిగిందని ఆ పత్రిక పేర్కొంది.

Also Read: మోదీకి ఫోన్ చేసి బెదిరిస్తే 5 గంటల్లో యుద్ధం ఆపేశారు… ట్రంప్ మరో బాంబు.. లేకపోతేనా..

అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదని ఓ రకంగా ట్రంప్ చేష్టలు ఇండియాకి అవమానకరంగానూ, ఒత్తిడి పెంచేవిగా ఉన్నాయని జర్మన్ పేపర్ రిపోర్ట్ చేసింది. అందుకే మోదీ.. ట్రంప్ కాల్ లిఫ్ట్ చేయలేదని, అమెరికా అధ్యక్షుడి చేష్టలు తమకు ఇబ్బంది కలిగిస్తున్నాయనే సంకేతాలు పంపేందుకే అలా చేశారని పేపర్ లో రాశారు.

మరోవైపు పాకిస్థాన్ తో అంటకాగుతూ.. భారత్ మీద టారిఫ్ లు విధించడం కూడా ట్రంప్ మీద భారత్ ధోరణిలో మార్పు తెచ్చింది. ఇండియా విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం.. టారిఫ్ లు విధించడం.. పాక్ కు సాయం చేయడం.. యుద్ధాన్ని తానే ఆపానని చెప్పడం లాంటి చర్యలు చూసి ట్రంప్ మీద ఇండియా ధోరణి మార్పుకి కారణమైంది.

వివిధ దేశాల మీద ఇష్టం వచ్చినట్టు టారిఫ్ విధించిన ట్రంప్ భారత్ మీద కూడా 50 శాతం టారిఫ్ లు విధించారు. అంత భారీ టారిఫ్ లు వేయడంతో భారత్ మీద భారీ ఇంపాక్ట్ పడనుంది. అయితే, భారత రైతులకు సంబంధించి మేలు జరిగే అంశంలో తాము కాంప్రమైజ్ అయ్యే చాన్సే లేదని ప్రధాని మోదీ ప్రకటించారు.