Narendra Modi
Narendra Modi – Awards : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు తొమ్మిదేళ్లు ముగిసిన వేళ.. ఇదే సమయంలో ఆయనకు ఈజిప్ట్ (Egypt) ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది నైల్ ప్రదానం చేయడం గమనార్హం. మోదీకి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి ( Abdel Fattah al Sisi ) ఇవాళ ఆ పురస్కారాన్ని ప్రదానం చేసిన విషయం తెలిసిందే. 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మోదీ అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.
మోదీకి 2023 మేలో పాపువా న్యూ గినియా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు అందించింది
మోదీకి 2023 మేలో ఫిజీ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ప్రదానం చేసింది. మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఈ అవార్డు అందించింది
మోదీకి 2023 మేలో పాపువా న్యూ గినియాలో పర్యటిస్తోన్న వేళ ఆయనకు రిపబ్లిక్ ఆఫ్ పలావ్ దేశం ఎబకల్ అవార్డు అందించింది
మోదీకి 2021 డిసెంబరులో భూటాన్ డ్రక్ గ్యాల్పో ఆర్డర్ పురస్కారం ప్రదానం చేసింది
మోదీకి 2020లో అమెరికా ప్రభుత్వం లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు అందించింది
మోదీకి 2019లో బహ్రెయిన్ కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్ ప్రదానం చేసింది
మోదీకి 2019లో మాల్దీవులు ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్ అందించింది
మోదీకి 2019లో రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు ప్రదానం చేసింది
అందే ఏడాది మోదీకి యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డు అందించింది
మోదీకి 2018లో పాలస్తీనా గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు ప్రదానం చేసింది.
మోదీకి 2016లో అఫ్గానిస్థాన్ స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ పురస్కారం ప్రదానం చేసింది.
అదే ఏడాది మోదీకి సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ పురస్కారం అందించింది.
ఇవేగాక పలు అంతర్జాతీయ సంస్థలు మోదీకి పలు అవార్డులను ప్రదానం చేశాయి.
Narendra Modi: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం ప్రదానం.. ఈ ప్రాంతాలను సందర్శించిన భారత ప్రధాని