సముద్రంలో మునిగి పురాతన ద్వారకలో పూజలు చేసిన ప్రధాని మోదీ .. ఫొటోలు వైరల్

ద్వారకా ఆలయంలో ప్రార్థనలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సముద్రంలోకి దిగి నీటమునిగిన ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో ప్రార్థనలు చేశారు.

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. గుజరాత్ లోని ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకను కలుపుతూ నిర్మించిన దాదాపు రెండున్నర కిలో మీటర్ల పొడవు కలిగిన తీగల వంతెనను ఆదివారం ప్రధాని ప్రారంభించారు. అంతకుముందు ద్వారక ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ప్రధానికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు.

Also Read : దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. దాని ప్రత్యేకతలు ఏమిటంటే?

ద్వారకా ఆలయంలో ప్రార్థనలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలోకి దిగి నీటమునిగిన పురాతన ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణుడికి సమర్పించడానికి అతను తనతో పాటు నెమలి ఈకను సముద్రంలోకి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. మునిగిపోయిన ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దైవిక అనుభవం. ఈ అనుభవం నాకు భారతదేశ ఆధ్యాత్మిక, చారిత్రక మూలాలతో అరుదైన, లోతైన అనుబంధాన్ని అందించిందని మోదీ పేర్కొన్నారు. శ్రీ కృష్ణ భగవానుడు మనందరినీ అనుగ్రహించాలంటూ అంటూ మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read : చంద్రబాబుతో చర్చల తర్వాత తేలనున్న గంటా శ్రీనివాసరావు భవిష్యత్‌

శ్రీకృష్ణుని కార్యక్షేత్రమైన ద్వారకాధామ్ కు నేను గౌరవప్రదంగా నమస్కరిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. శ్రీకృష్ణుడు దేవభూమి ద్వారకలో ద్వారకాధీశుని రూపంలో ఉంటాడు. ఇక్కడ ఏది జరిగినా అది ద్వారకాధీశుని కోరిక మేరకు మాత్రమే జరుగుతుంది. నేను సముద్రంలోకి వెళ్లి పురాతన ద్వారకను చూశాను. సముద్రంలో మునిగిన ద్వారక గురించి పురావస్తు నిపుణులు చాలా రాశారు. ఈ ద్వారకా నగరాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని చెబుతారు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను.. చాలా ఎమోషనల్ గా ఉన్నాను. ఆ పుణ్యభూమిని తాకడం ద్వారా నేను దశాబ్దాలుగా ప్రతిష్టాత్మకంగా భావించే కల ఈరోజు నెవరేరింది. నాలో నేను ఎంత ఆనందాన్ని అనుభవిస్తానో మీరు ఊహించవచ్చునని ప్రధాని అన్నారు.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు