Signature Bridge: ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోన్న ప్రధాని మోదీ డ్రీమ్‌ ప్రాజెక్ట్.. ఎక్కడో తెలుసా

సిగ్నేచర్ బ్రిడ్జిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వంతెనపై A అకారంలో రెండు పైలాన్‌లను ఏర్పాటు చేశారు. 13 వందల ఎత్తుల్లో వీటి నిర్మాణాన్ని చేపట్టారు.

Okha Beyt Dwarka Signature Bridge in Gujarat

Okha-Beyt Dwarka Signature Bridge: ప్రధాని మోదీ డ్రీమ్‌ ప్రాజెక్ట్ (PM Modi Dream Project) సిగ్నేచర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. 978 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెనను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని గుజరాత్ (Gujarat) ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అరేబియా సముద్రంలో (Arabian Sea) నిర్మిస్తున్న ఈ వంతెనలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ బ్రిడ్డి అందుబాటులోకి వస్తే గుజరాత్ పర్యాటకానికి మరింత అందాన్ని తీసుకరానుంది.


గుజరాత్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిగ్నేచర్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 92 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అనుకున్నట్లు పనులు జరిగితే త్వరలోనే ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకరావాలని గుజరాత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. సిగ్నేచర్ బ్రిడ్జ్ మెుత్తం పొడువు రెండువేల 320 మీటర్లు కాగా అందులో 900 మీటర్లు కేబుల్ బ్రిడ్జ్ ఉండనుంది.


గుజరాత్‌లోని తీర ప్రాంతమైన ఓఖాను, ఆధ్యాత్మిక ద్వీపమైన బేట్ ద్వారకాను ఈ వంతెన అనుసంధానిస్తుంది. 978 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ అక్టోబర్ కల్లా పూర్తవుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ డ్రీమ్ ప్రాజెక్టు కావటంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలాగే పనులు జరిగితే అక్టోబర్‌లోనే సిగ్నేచర్ బ్రిడ్జిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.


2016లోనే కేంద్ర ప్రభుత్వం సిగ్నేచర్ బ్రిడ్డిని మంజూరు చేసింది. 2018 మార్చిలో బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. అధునాతన హాక్ క్రేన్‌లను ఉపయోగించి ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులను చేస్తున్నారు. సిగ్నేచర్ బ్రిడ్జి కోసం సముద్రంలో 38 స్తంభాలను నిర్మించారు. గతంలో ఓఖా నుంచి బేట్ ద్వారకా మధ్య ప్రయాణించడానికి ఫెర్రీ బోట్‌లపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ ప్రాజెక్టుతో ఓఖా, బేట్ ద్వారక మధ్య ప్రయాణం సులభతరం కానుంది. అంతేకాదు పర్యాటకుల్ని కూడా విశేషంగా ఆకట్టుకోనుంది ఈ సిగ్నేచర్ బ్రిడ్జి. సందర్శకులకు వసతి కల్పించడానికి ఓఖా వద్ద ప్రత్యేక పార్కింగ్‌కు వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది భూపేంద్ర పటేల్ సర్కార్.


సిగ్నేచర్ బ్రిడ్జిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వంతెనపై A అకారంలో రెండు పైలాన్‌లను ఏర్పాటు చేశారు. 13 వందల ఎత్తుల్లో వీటి నిర్మాణాన్ని చేపట్టారు. నాలుగు లేన్ల వంతెనకు ఇరువైపులా 2.50 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది పాదాచారులకు ఎంతోగానే ఉపయోగపడనుంది. పర్యావరణాన్ని దృష్టిల్లో పెట్టుకుని ఫుట్‌పాత్‌పై సౌర ఫలకాలను కూడా ఏర్పాటు చేశారు. వంతెనకు లైటింగ్‌తోపాటు ఓఖాకు విద్యుత్ అవసరాలను తీర్చేలా ఈ సౌర ఫలకాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంతేకాదు దేశంలోనే అత్యంత పొడవైనదిగా ఈ సిగ్నేచర్ బ్రిడ్జ్‌ కొత్త రికార్డును నెలకొల్పనుంది.

Also Read: అయోధ్య రామయ్య గుడి కోసం.. ప్రపంచంలోనే అతి పెద్ద తాళం.. ఎంత బరువో తెలుసా!

పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని వంతెనపై 12 ప్రదేశాలలో వ్యూ గ్యాలరీలు ఏర్పాటు చేశారు అధికారులు. వ్యూ గ్యాలరీల నుంచి సుందర దృశ్యాలు కనిపించేలా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. సాయంత్రం వేళల్లో సిగ్నేచర్ బ్రిడ్జికి అదనపు అందం కోసం, వంతెనపై బ్యూటీఫుల్ లైటింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ లైటింగ్ వంతెనకు మరింత అందాన్ని తీసుకరానుంది.

Also Read: చంద్రుడిని కలిసిన చంద్రయాన్ -3…ఇస్రో విడుదల చేసిన మొదటి వీడియో, చిత్రం

ఈ ప్రాజెక్టు ఇంజనీర్ల ప్రతిభకు పట్టం కట్టే విధంగా ఉంటుందని గుజరాత్ సర్కార్ చెబుతోంది. మరోవైపు గుజరాత్‌కు ఓ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లా మారే అవకాశం ఉంది. పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్న గుజరాత్ సర్కార్.. పర్యాటక కేంద్రాలను మెరుగుపర్చేందుకు పనులను వేగవంతం చేస్తోంది.