Vande Bharat Trains : దేశంలో మరో ఐదు వందే భారత్ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ తాజాగా ప్రారంభించిన ఐదు రైళ్లతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరింది. అత్యాధునిక సదుపాయాలతో సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను తయారు చేశారు.

Vande Bharat-PM Modi

PM Modi flagged off Vande Bharat Trains : భారత్ లో ఇప్పటికే వందే భారత్ రైళ్లు పరుగులు తీసున్న సంగతి తెలిసిందే. దేశంలో తాజాగా మరో ఐదు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం ఐదు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ లో రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

భోపాల్ నుంచి ఇండోర్, భోపాల్ నుంచి జబల్ పుర్ కు వెళ్లే రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. మిలిగిన మూడు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. మడ్ గావ్ నుంచి ముంబై, ధార్వాడ నుంచి బెంగళూరు, హతియా నుంచి పాట్నాకు వెళ్లే మూడు రైళ్లను ప్రధాని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

New York Diwali : న్యూయార్క్ లో దీపావళి రోజున స్కూల్స్ కు సెలవు

ఈ రైళ్ల ద్వారా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా, ప్రధాని మోదీ తాజాగా ప్రారంభించిన ఐదు రైళ్లతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరింది. అత్యాధునిక సదుపాయాలతో సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను తయారు చేశారు.

మరోవైపు భారతీయ రైల్వే మరో సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వందే భారత్ సెమీ స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టిన ఇండియన్ రైల్వే అంతకుమించిన స్పీడ్ తో త్వరలో అల్యూమినియం రైళ్లను ప్రవేశపెట్టనుంది. స్విస్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన సంస్థలు అల్యూమినియం రైళ్ల తయారీకి బిడ్ లు కూడా సమర్పించాయి. త్వరలో హైస్పీడ్ రైళ్లలో స్లీపర్ క్లాస్ ప్రయాణం అందుబాటులోకి రానుంది.

ట్రెండింగ్ వార్తలు