Aadi Mahotsav: ‘ఆది మహోత్సవ్’ప్రారంభించిన ప్రధాని మోడీ..స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి నివాళులు

ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ‘ఆది మహోత్సవ్’ (Aadi Mahotsav)ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో కేంద్ర గిరిజనశాఖా మంత్రి అర్జున్ ముండా పాల్గొన్నారు. అనంతరం మోడీ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు.

Aadi Mahotsav: ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ‘ఆది మహోత్సవ్’ (Aadi Mahotsav)ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో కేంద్ర గిరిజనశాఖా మంత్రి అర్జున్ ముండా పాల్గొన్నారు. అనంతరం మోడీ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ “ఆది మహోత్సవ్”ను ప్రారంభించిన ప్రధాని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గిరిజన విప్లవవీరుడు బిర్సా ముండా భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. బిర్సా ముండా జాతికి చెందిన వ్యక్తి. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించిన నాయకుడు. పోరాటాలే పరమావధిగా జీవించిన బిర్సా ముండా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. బిర్సా ముండా గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది.నంబర్ 15న ఆయన జయంతికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తుంటారు.

బ్రిటిషు వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు. పట్టుమని పాతికేళ్లు కూడా దాటకుండానే బిర్సా ముండా చేసిన పోరాటాలు అసామాన్యమైనవి. బిర్సా ముండా, జార్ఘండ్ లోని ఖుంతీ జిల్లా, ఉలిహతు గ్రామంలో 1875లో నవంబర్ 15 జన్మించారు.గిరిజన విప్లవవీరుడు బిర్సా ముండా భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడుగా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు బిర్సా ముండా.

ట్రెండింగ్ వార్తలు