PM Modi
PM Modi: గుజరాత్ రాష్ట్రం కుచ్ జిల్లాలోని భుజ్ ప్రాంతంలో 2001లో సంభవించిన భూకంపం సమయంలో ప్రజలు చూపిన దృఢత్వాన్ని గుర్తుచేసే స్మృతి వాన్ మెమోరియల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. స్మృతి వాన్ ప్రాణాలు కోల్పోయిన కచ్ ప్రజల అద్భుతమైన పోరాట స్ఫూర్తికి నివాళి అని ప్రధాని మోదీ అన్నారు. అనంతరం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కలిసి ప్రధాని నరేంద్ర మోదీ స్మృతివన్ మ్యూజియంలో ఏర్పాట్లను పరిశీలించారు. భుజ్ కేంద్రంగా 2001లో సంభవించిన భూకంపం సమయంలో 13,000 మంది మరణించిన తర్వాత, ఈ స్మారక చిహ్నం దాదాపు 470 ఎకరాల్లో నిర్మించబడింది.
ఈ స్మారక చిహ్నం భూకంపం సమయంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల పేర్లను కలిగి ఉంది. ఈ మ్యూజియంలో గుజరాత్ స్థలాకృతి, 2001 భూకంపం తర్వాత పునర్నిర్మాణ కార్యక్రమాలు, విజయగాథలను వివరిస్తూ చిత్రలను ఏర్పాటు చేశారు. ఇది 5D సిమ్యులేటర్ సహాయంతో భూకంపం యొక్క అనుభవాన్ని పునరుద్ధరించడానికి ఒక బ్లాక్, భూకంప సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకు మరొక బ్లాక్‌ని ఏర్పాటు చేశారు.
Prime Minister Narendra Modi along with CM Bhupendra Patel at the 'Smritivan'- 2001 earthquake memorial and museum, in Gujarat's Bhuj pic.twitter.com/OavMZy2OJl
— ANI (@ANI) August 28, 2022
అదేవిధంగా గుజరాత్‌లో 2001 సంవత్సరంలో భూకంపం సమయంలో మరణించిన పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు నివాళిగా కచ్ జిల్లాలోని అంజర్ పట్టణం శివార్లలో నిర్మించిన ‘వీర్ బాలక్ మెమోరియల్’ స్మారకాన్నీ ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.