అమర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ

  • Publish Date - January 26, 2020 / 04:50 AM IST

71వ గణతంత్ర వేడుకలు ఆదివారం (జనవరి 26, 2020) దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా గేట్ సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. స్మారక స్థూపం వద్ద పుష్పగుఛ్చం ఉంచి దేశ ప్రజల తరుఫున శ్రధ్ధాంజలి ఘటించారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవనే, నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ మార్షల్ ఆర్‌కేఎస్ బదూరియా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.