PM Modi : అడవులను నాశనం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారు- కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

తాము పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం అటవీ సంపదను సర్వ నాశనం చేస్తోందని విరుచుకుపడ్డారు మోదీ.

PM Modi : కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేస్తోందని, అడవులను నాశనం చేస్తూ వన్యప్రాణులను చంపుతోందని మోదీ అన్నారు. అడవులపైకి బుల్డోజర్లు పంపించడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందన్నారు. తాము పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం అటవీ సంపదను సర్వ నాశనం చేస్తోందని విరుచుకుపడ్డారు మోదీ.

హర్యానాలో ప్రధాని మోదీ పర్యటించారు. పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు మోదీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదన్నారు.

కర్నాటకలో కాంగెస్ ప్రభుత్వం అన్నింటి ధరలను పెంచేసిందని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రకృతిని ధ్వంసం చేస్తోందని విరుచుకుపడ్డారు మోదీ. ఓవైపు బీజేపీ ప్రకృతిని కాపాడేందుకు కృషి చేస్తుంటే, మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడవులను నాశనం చేస్తోందన్నారు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్ డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్ ని ఫాలో అవ్వండి..

”తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో అడవులను ధ్వంసం చేస్తోంది. ఒకవైపు మేము పర్యావరణాన్ని పరిరక్షిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వన్యప్రాణులు, ప్రకృతిని నాశనం చేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం విస్మరించింది. మరోవైపు కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటి ధరలు విపరీతంగా పెంచేస్తోంది. కాంగ్రెస్ మోడల్ విఫలమైంది. మా ఉద్దేశంలో అధికారం అంటే దేశానికి, ప్రజలకు సేవ చేయడమే. బీజేపీ ఏం చెబుతోంది అది కచ్చితంగా పాటిస్తుంది.

Also Read : తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. 7లక్షల మందికి మేలు జరిగేలా కొత్త పాలసీ..

హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రజలు చాలా ఆవేదనలో ఉన్నారు. అభివృద్ధి పనులేవీ జరగడం లేదు.

Also Read : అమల్లోకి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ.. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం.. ఏ గ్రూపులో ఏయే కులాలు ఉన్నాయి..? రిజర్వేషన్ ఏంతంటే..

కర్నాటకలో విద్యుత్ నుంచి పాల ధరల వరకు.. బస్ ఛార్జీలు ఇలా అన్నింటి ధరలు పెంచేశారు. కర్నాటకలో అన్నింటి ధరలు పెంచేశారు, ప్రజలపై ట్యాక్సుల భారం మోపారు. కర్నాటకను అక్కడి సీఎం అవినీతిలో నెంబర్ 1 చేశారని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కూడా అంతే. ప్రజలకు ఇచ్చిన హామీలను అక్కడి ప్రభుత్వం మర్చిపోయింది.

అక్కడి కాంగ్రెస్, అక్కడి ప్రభుత్వం అడవులపైకి బుల్డోజర్లు పంపడంలో బిజీగా ఉంది. ప్రకృతిని నాశనం చేస్తోంది. వన్యప్రాణులను చంపుతోంది.. ఇదీ కాంగ్రెస్ తీరు.. ఇప్పుడే దేశంలో ప్రభుత్వాన్ని నడిపే రెండు మోడళ్లు ఉన్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ మోడల్. పూర్తిగా అబద్దం అని తేలిపోయింది. మరొకటి బీజేపీ మోడల్. సత్యం మీద నడుస్తోంది. రాజ్యాంగబద్దంగా పాలన చేస్తున్నాం. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం” అని ప్రధాని మోదీ అన్నారు.