Ayodhya Ram Mandir
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 రోజుల దీక్ష ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు దీక్షను ముగియనున్నారు మోదీ. తమిళనాట మోదీ ఆధ్యాత్మిక యాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. 11 రోజులుగా మోదీ దీక్ష కొనసాగుతోంది. నేలపైనే పడుకుంటున్నారు.. కొబ్బరి నీరు సేవిస్తూ ఉపవాస దీక్ష జరిగింది.
అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు ముందు పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు మోదీ. రామేశ్వరం సమీపంలోనే ఉన్న ధనుష్కోటిలో ఇవాళ మోదీ.. కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. దీంతో మోదీ యాత్ర ముగుస్తుంది. కోదండరామస్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు.
రామసేతు నిర్మించిన ప్రదేశంగా భావించే అరిచల్ మునైనిలో నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. నిన్న తమిళనాడులోని శ్రీ రంగనాథస్వామి, రామనాథస్వామి ఆలయాలను సందర్శించారు. రామేశ్వరం అగ్ని తీర్థం బీచ్‌లో స్నానమాచరించారు.
సకల గుణాభిరాముడు నడయాడిన నేల..
అయోధ్యలో రేపు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయోధ్య.. అయోధ్య.. దేశం మొత్తం జపిస్తున్న పదం అయోధ్య రామయ్య. ఇప్పుడు అందరి గమ్యం అయోధ్యే… అందరి చూపూ… అందరి ఆలోచనా… అందరి దృష్టి.. అందరి ఆసక్తి…. అయోధ్యే.. హిందువుల జీవితకాలపు కల.. నిజం కాబోతున్న వేళ.. శ్రీరామచంద్రుడు కొలువుదీరే చారిత్రక, మహిమాన్విత, మహాద్భుత క్షణాన అయోధ్య చరిత్ర తెలుసుకోవాల్సిందే… పురాణ, ఇతిహాసాల్లోనే కాదు.. వర్తమానంలోనూ అయోధ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
శ్రీరాముని పేరు వినగానే భక్తుల మనసు పులకిస్తుంది. కోదండ రాముని పేరు తలుచుకుంటే కోటి కష్టాలు మాయమవుతాయిని హిందువులు భావిస్తారు. పురాణాల ప్రకారం.. నిజాయితీకి, నీతిమంతమైన పాలనకు నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు. మనిషికి ఉండాల్సిన సద్గుణాలకు పోలికగా… రాముడిని తప్ప మరే దేవుడిని ఉదహరించలేము. సకల జనులకు రాముడే ఆదర్శం.
అలాంటి సకల గుణాభిరాముడు నడయాడిన నేల అయోధ్య. జగదభి రాముడు జన్మించిన పవిత్ర భూమి అయోధ్య. సకల మానవాళికి జీవన నడవడిని నేర్పిన వేదభూమి అయోధ్య. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య వెలుగొందింది.
PM Narendra Modi : ప్రధాని మోదీ తమిళనాడు ఆలయాల సందర్శన ఫొటోలు..