PM Modi మోదీ న్యూ ఇండియా : రైల్వే స్టేషన్ పై 5-స్టార్ హోటల్..

ప్రధాని నరేంద్ర మోదీ తరచూ చెప్పే న్యూ ఇండియా కళ్లారా ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వ విధానాల దగ్గర్నుంచి భవనాల దాకా అన్నింటా మ్యాజిక్ చేసి చూపిస్తోన్న మోదీ సర్కార్.. తాజాగా మరో అత్యద్భుతాన్ని ఆవిష్క్రరించనుంది.

PM Modi to inaugurate 5-star hotel : ప్రధాని నరేంద్ర మోదీ తరచూ చెప్పే న్యూ ఇండియా కళ్లారా ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వ విధానాల దగ్గర్నుంచి భవనాల దాకా అన్నింటా మ్యాజిక్ చేసి చూపిస్తోన్న మోదీ సర్కార్.. తాజాగా మరో అత్యద్భుతాన్ని ఆవిష్క్రరించనుంది. 100 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మోదీ శుక్రవారం గుజరాత్‌లో ప్రారంభిస్తారు. రానున్న రోజుల్లో దేశంలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు ఎలా మారబోతున్నాయో చూపించేలా నిర్మించిన గాంధీనగర్ క్యాపిటల్ రైల్వేస్టేషన్‌ను ప్రధాని మోదీ ఇంకొద్ది గంటల్లో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులలో అత్యాధునిక సైన్స్ నగరంలో మూడు కొత్తగా ఆకర్షించనున్నాయి.

రైల్వే స్టేషన్ పైన 5 స్టార్ హోటల్, కొత్త రైళ్లు ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్ గాంధీనగర్ రైల్వే స్టేషన్‌లో ఉండగా.. అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీ మూడు కొత్తగా ముస్తాబైంది. వాటర్ గ్యాలరీ, రోబోటిక్ గ్యాలరీ, నేచర్ పార్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. దేశంలోనే తొలి రైల్వే స్టేషన్‌గా గాంధీనగర్‌లో పునరాభివృద్ది పనులు 2017లో ప్రారంభమయ్యాయి. ఇండియన్ రైల్వే స్టేషన్స్ రీడెవలప్‌మెంట్ కార్పొరేషన్-IRSDC ఆధ్వర్యంలో వాయువేగంతో సాగిన పనులు ఇటీవలే పూర్తయ్యాయి.


ఎయిర్ పోర్ట్‌ను తలపించే గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ థీమ్ బేస్డ్ లైటింగ్ ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. అన్నివర్గాల ప్రయాణికులు ప్రార్థన చేసుకోవడానికి ప్రత్యేకమైన హాల్ కూడా ఉంది. గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్‌లో పట్టాలపైనే నిర్మించిన 5 స్టార్ హోటల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రైల్వే స్టేషన్‌ పైన లగ్జరీ హోటల్ నిర్మాణం దేశంలోనే మొదటిసారి. ఈ హోటల్‌లో 318 గదులు ఉన్నాయి. 7 వేల 400 చదరపు మీటర్ల విస్తీర్ణంగల ఈ నిర్మాణానికి 790 కోట్ల రూపాయల ఖర్చు చేశారు. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొనడానికి వచ్చే అతిథులకు, మహాత్మా మందిర్‌లో కాన్ఫరెన్సులకు వచ్చేవారికికి ఈ హోటల్ ఆతిథ్యం ఇవ్వనుంది.


రైల్వే స్టేషన్‌ హరిత భవనం :
– వికలాంగులకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
– గాంధీనగర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం 2017 జనవరిలో ప్రారంభమైంది.
– గాంధీనగర్ రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్టుల మాదిరిగా పునరుద్దరణ
– రెండు ఎస్కలేటర్లు, మూడు ఎలివేటర్లు, రెండు అండర్ గ్రౌండ్ సబ్వే ప్లాట్‌ఫారమ్‌లు
– 7,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త రైల్వే స్టేషన్
– మల్టీప్లెక్స్, షాపింగ్, ఫుడ్ కోర్టులు, PPP మోడ్‌లో ఆపరేట్ చేయవచ్చు.
– ఈ స్టేషన్‌లో 40 సీట్ల సెంట్రలైజ్డ్ AC వెయిటింగ్ లాంజ్, LED Wall Display లాంజ్ ఆర్ట్ గ్యాలరీలు

ట్రెండింగ్ వార్తలు