నేనూ చౌకీదారునే…రాహుల్ ఆరోపణలకు మోడీ రివర్స్ ఎటాక్

చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ సరికొత్త ప్రచారం చేపట్టింది.మై భీ చౌకీదార్ పేరుతో ప్రధాని మోడీ శనివారం(మార్చి-16,2019) మూడు నిమిషాల నిడివిగల ఓ వీడియాను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దేశ అభివృద్ధి, అవినీతిరహిత భారతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతిఒక్కరూ కాపలాదారులేనని ట్యాగ్ చేశారు.
Read Also : ములాయం తరపున మాయావతి ప్రచారం : 24 ఏళ్ల తర్వాత  

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ట్విటర్‌ వేదికగా కార్యకర్తలనుద్దేశించి మోడీ ఓ సందేశమిచ్చారు. మీ చౌకీదార్‌ ఇక్కడ నిలబడి దేశం కోసం సేవ చేస్తున్నారు. కానీ నేను ఒంటరి కాదు. అవినీతి, సామాజిక రుగ్మతలు, అపరిశుభ్రతపై పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ చౌకీదారే. దేశ అభివృద్ధి కోసం కష్టపడుతున్న వారంతా చౌకీదార్లే. ‘నేను కూడా కాపలాదారునే’ అని నేడు ప్రతి భారతీయుడు సగర్వంగా చెబుతున్నాడు’ అని ట్వీట్ చేశాడు.

చౌకీదార్ వ్యాఖ్యలను కాంగ్రెస్ మానకుంటే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని భారతీయ మజ్దూర్ సంఘ్ ఇటీవల డిమాండ్ చేసింది. కూడా హెచ్చరించింది. 2014 ఎన్నికల ప్రచారం సమయంలోనూ బీజేపీ ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన ఛాయ్‌ వాలా వ్యాఖ్యలను బీజేపీ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంది.