మహారాష్ట్ర : ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి మోడీపై నిప్పులు చెరిగారు. లోక్ పాల్, లోకాయుక్తల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన 81 ఏళ్ల హజారే మరోసారి దీక్ష చేపట్టారు. జనవరి 30వ తేదీన మహారాష్ట్రలోనలి రాలేగావ్ సిద్ధిలో దీక్షను స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 03వ తేదీన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఏమైనా జరిగితే మాత్రం…భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రజలు నిలదీస్తారని తెలిపారు. లోక్ పాల్, లోకాయుక్తను నియమించడంలో ఇంతెందుకు జాప్యం చేస్తున్నారని…దీనిని నియమించడం వల్ల ప్రధాని, ముఖ్యమంత్రులను సైతం విచారించే అవకాశం వస్తుందని చెప్పారు. దీనికారణంగానే పార్టీలు దీనిని తీసుకరావడానికి జంకుతున్నాయన్నారు.
మరోవైపు హజారే చేస్తున్న దీక్షకు సరియైన స్పందన రావడం లేదని పేర్కొంటూ గ్రామస్తులు ఫిబ్రవరి 02వ తేదీ శనివారం వారి విలేజ్‌లో నిరసన ప్రదర్శనలు చేశారు. జనవరి 1వ తేదీన ప్రధాని మోడీకి లేఖ రాస్తే కేవలం ధన్యవాదాలు..విషెస్ మాత్రమే తెలిపారని గ్రామస్థులు పేర్కొంటున్నారు. మరి అన్నా హజారే చేసిన కామెంట్స్‌పై ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.