సీనియర్ బ్యూరోక్రాట్,ప్రధాని మోడీ ప్రైవేట్ సెక్రటరీ రాజీవ్ తోప్నో…వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్(ED)కి సీనియర్ సలహాదారుడిగా నియమితులయ్యారు. దీనికి సంబంధించి ఇవాళ(జూన్-4,2020)సిబ్బంది,వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ఆర్డర్ ను జారీ చేసింది. రాజీవక తోప్నో…గుజరాత్ కేడర్ కు చెందిన 1996 బ్యాచ్ IAS అధికారి.
మరోవైపు,ప్రధానమంత్రి కార్యాలయం(PMO)ఆఫీస్ లో పనిచేసిన బ్రజేంద్ర నవనిత్…స్విట్టర్లాండ్ లోని జెనీవాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(WTO)కు భారత పార్లమెంట్ ప్రతినిధి మరియు అంబాసిడర్ గా నియమించబడ్డారు. తమిళనాడు కేడర్ కు చెందిన 1999 IAS బ్యాచ్ ఆఫీసర్ నవనిత్…2014 జులై-2019సెప్టెంబర్ మధ్యలో PMOలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఈ నియామకాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి మరియు ఈ సంస్థలు వివిధ వాణిజ్య-సంబంధిత కార్యకలాపాలను నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విదేశాలలో వివిధ ఆర్థిక, వాణిజ్య సంబంధిత పోస్టులకు మరో ఐదుగురు అధికారులను నియమించడ్డారు. సీనియర్ IAS అధికారి రవి కోట వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో మంత్రి (ఆర్థిక) గా వ్యవహరించనున్నారు. రవి కోట…అస్సాం-మేఘాలయ క్యాడర్ కు చెందిన 1993 బ్యాచ్ IAS అధికారి.
చైనాలోని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (CSS) అధికారి లెఖన్ ఠక్కర్‌ను కౌన్సిలర్ (ఎకనామిక్) గా నియమించారు. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (ICAS) 2000 బ్యాచ్ అధికారి H అథెలి… ఫిలిప్పీన్స్ లోని మనీలాలోని ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కి సలహాదారు (డైరెక్టర్ స్థాయి) గా నియమించబడ్డారు.
WTOకు శాశ్వత మిషన్ ఆఫ్ ఇండియా కౌన్సిలర్‌గా అన్వర్ హుస్సేన్ షేక్ నియమితులయ్యారు. అన్వర్ హుస్సేన్ 2000 బ్యాచ్ భారత రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. ఎన్. అశోక్ కుమార్ బెల్జియంలోని బ్రసెల్స్ లోని భారత ఎంబసీలో సలహాదారు (పరిశ్రమ మరియు ఇంజనీరింగ్)గా నియమించబడ్డారు. అతను మణిపూర్ క్యాడర్ 2004 బ్యాచ్ IAS అధికారి. ఈ అధికారులందరికీ మూడేళ్ల పదవీకాలం ఉంటుందని ఉత్తర్వులో తెలిపారు.