LPG Cylinder : మహిళలకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ.. వంటగ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు.

PM Modi

PM Modi : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా మోదీ ప్రకటించారు. ఇది దేశవ్యాప్తంగా కోట్లాది మంది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.

Also Read : Maha Shivaratri 2024: మహాశివరాత్రి రోజున పూజ సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఎందుకు..

వంట గ్యాస్ ను మరింత సరసమైనదిగా చేయడం ద్వారా పేద ప్రజల కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ అన్నారు. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ఈజ్ ఆఫ్ లివింగ్ ను అందించడానికి మా ప్రభుత్వం నిబద్ధతకు అనుగుణంగా ఉందని ప్రధాని ట్వీట్ లో పేర్కొన్నారు.