మహాశివరాత్రి రోజున పూజ సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఎందుకు..

ముఖ్యంగా శివ భక్తిని చాటుకునే రోజు శివరాత్రి. ఈ పర్వదినం రోజున దేవదేవుని కరుణాకటాక్షాలను పొందేందుకు శివ మహాదేవుని ఆరాధన, జాగరణ చేస్తాం.

మహాశివరాత్రి రోజున పూజ సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఎందుకు..

Maha Shivaratri 2024

Maha Shivaratri 2024: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ ఉట్టిపడుతోంది. పలు ప్రాంతాల్లోని ఆలయాల వద్ద స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామున నుంచే పోటెత్తారు. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. హిందూ మతంలో మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు శివుడిని పూజిస్తారు. భగవంతుని అనుగ్రహం కోసం శివలింగానికి జలాభిషేకం, రుద్రాభిషేకం వంటి పవిత్రమైన ఆచారాలను నిర్వహిస్తారు. భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. అయితే, శివరాత్రి రోజున స్వామివారికి పూజా సమయంలో ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయాన్ని తెలుసుకుందాం.

Also Read : Maha Shivaratri 2024 : తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

శివుడికి ఆకుపచ్చని రంగు అంటే ఇష్టపడతారని నమ్ముతారు. మహాశివరాత్రి పండుగ రోజున స్వామివారికి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో ఆకుపచ్చని దుస్తులతోపాటు ఎరుపు, పసుపు, గులాబీ, నారింజ, తెలుపు రంగుల దుస్తులను వేసుకోవచ్చు. మహా శివరాత్రి రోజున నలుపు, నీలం రంగు దస్తులకు దూరంగా ఉంటే మంచిది. ఈ రంగులు ప్రతికూల శక్తిని తెస్తాయని నమ్ముతారు. ఆరాధన సమయంలో నలుపు, నీలం రంగు దుస్తులు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.

Also Read : Maha Shivratri 2024: శివుడి 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవాల్సిందే..

మహాశివరాత్రి రోజున పూజా సమయంలో, సాయంత్రం వేళ నిద్రకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా శివ భక్తిని చాటుకునే రోజు శివరాత్రి. ఈ పర్వదినం రోజున దేవదేవుని కరుణాకటాక్షాలను పొందేందుకు శివ మహాదేవుని ఆరాధన, జాగరణ చేస్తాం. రాత్రి వేళలో నిద్రపోకుండా జాగరణకు కూర్చుంటారు. శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ స్వామిని ఆరాధించి కీర్తిస్తారు. మహాశివరాత్రి రోజున కోరిన వరాన్ని ఇచ్చే రాత్రి ఈ మహాశివరాత్రి నిష్ఠతో ఆచరించే భక్తులకు కోరిన ప్రతీకోరికా తీరుతుందనే నమ్మకం.