Modi Satires On Cm Mamta
PM modi comments on mamta banerjee : పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మాంచీ హీటుమీదుంది. దీంట్లో భాగంగా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖరగ్ పూర్ లో ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్న ప్రధాని మోడీ సీఎం మమతా బెనర్జీపై సెటైర్లు వేశారు. దీదీ పాలనపై మోడీ దనదైన శైలి పంచ్ డైలాగులతో సెటైర్లు విసిరారు. దీదీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
నిన్న అంటే మార్చి 19న వాట్సాప్, ఫేస్ బుక్ లు కొన్ని నిమిషాలపాటు నిలిచిపోయాయి. ఈక్రమంలో వాటినే మోడీ దీదీపై వ్యంగ్యాస్త్రాలుగా సంధించారు. ‘‘ నిన్న వాట్సాప్, ఫేస్ బుక్ 55నిమిషాల పాటు నిలిచిపోయాయి..కానీ పశ్చిమబెంగాల్ లో గత 55 ఏళ్లుగా అభివృద్ధి నిలిచిపోయింది’’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎన్నో ఆశలతో బెంగాల్ ప్రజలు మమతాను ఎన్నుకున్నారనీ..కానీ వారి ఆశలన్నీ అడియాసలు అయిపోయాయని..బెంగాల్ ప్రజల కలలు కల్లలైపోయాయని విమర్శించారు. కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెసులు అభివృద్దిని అడ్డుకుంటున్నాయంటూ ఇరు కాంగ్రెస్ లపై ఒకేసారి విమర్శలు సంధించారు మోడీ. వాట్సాప్, ఫేస్ బుక్ లు 55 నిమిషాలు నిలిచిపోతేనే ప్రజలు అందరితో సంబధాలు తెగిపోయాయని ఆందోళన చెందారు. అటువంటిది బెంగాల్ లో 55 ఏళ్లపాటు అభివృద్ధి ఆగిపోతే ప్రజల పరిస్థితి ఏంటి అంటూ మోడీ ప్రశ్నించారు.