కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు

వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019) నామినేషన్ వేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు.కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు తెలుపుతున్నానని మోడీ అన్నారు. ఏదేళ్ల తర్వాత మరోసారి కాశీ ప్రజలు తనను ఆశీర్వదించారన్నారు.వారణాశిలో నిన్న జరిగిన మెగా రోడ్ షో గురించి ప్రస్తావిస్తూ…ఇంత గ్రాండ్ షో కాశీలో తప్ప మరెక్కగా సాధ్యం కాదని ఆయన అన్నారు.కొంతమంది తనపై అసత్య ప్రచారాలు చేస్తూ బీజేపీకి ఓటు వేయవద్దంటూ ప్రచారం చేస్తున్నారని మోడీ అన్నారు.
Also Read : బొమ్మ పడదు : పీఎం నరేంద్ర మోడీ బయోపిక్ మే 19 తర్వాతే

అయినా ఏం ఫర్వాలేదని,బీజేపీ విజయం ఖాయమని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్నవారిని పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ణప్తి చేస్తున్నానని అన్నారు. ఓటు వేయడం ప్రజల హక్కు అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటం మనందరి విధి అని ఆయన తెలిపారు.ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలని,అభివృద్ధికి తోడ్పడాలని మోడీ అన్నారు.

>