Gujarat Defense Expo 2022 : వెపన్స్ మేడిన్ ఇండియా .. 12వ డిఫెన్స్ ఎక్స్‌పోలో భారత్ ఆయుధాల ప్రదర్శన

ఒకప్పుడు ఆయుధాలను దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశంగా ఉన్న భారత్.. ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇందుకు గుజరాత్‌లో డిఫెన్స్ ఎక్స్‌పోలో కుదురుతున్న ఎంవోయూలే కారణం. భారత అమ్ములపొదిలో ఉన్న అనేక ఆయుధాలను.. ఇండియా విదేశాలకు విక్రయిస్తోంది. చాలా దేశాలు.. మేడిన్ ఇండియా వెపన్స్‌పై ఇంట్రస్ట్ చూపిస్తుండటం నిజంగా పెద్ద ఛేంజ్ అని చెప్పొచ్చు. ఆయుధాల తయారీ, విక్రయ రంగంలో.. భారత్ స్థిరంగా ఎదుగుతుండటం పెద్ద పరిణామమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Defense Expo 2022 In Gujarat : ఒకప్పుడు ఆయుధాలను దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశంగా ఉన్న భారత్.. ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇందుకు గుజరాత్‌లో డిఫెన్స్ ఎక్స్‌పోలో కుదురుతున్న ఎంవోయూలే కారణం. భారత అమ్ములపొదిలో ఉన్న అనేక ఆయుధాలను.. ఇండియా విదేశాలకు విక్రయిస్తోంది. చాలా దేశాలు.. మేడిన్ ఇండియా వెపన్స్‌పై ఇంట్రస్ట్ చూపిస్తుండటం నిజంగా పెద్ద ఛేంజ్ అని చెప్పొచ్చు. ఆయుధాల తయారీ, విక్రయ రంగంలో.. భారత్ స్థిరంగా ఎదుగుతుండటం పెద్ద పరిణామమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారతదేశంలో ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడమే లక్ష్యంగా.. 12వ డిఫెన్స్ ఎక్స్‌పో ఎడిషన్‌ సాగుతోంది. ఇందులో.. కేవలం ఇండియాకు చెందిన కంపెనీలు మాత్రమే పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో భారత్‌కు సంబంధించి గొప్ప చిత్రం ఆవిష్కృతమైంది. దేశ యువత శక్తి, సామర్థ్యాలతో ఇండియా ఏమేరకు డెవలప్ అయిందో కనిపిస్తోంది. తొలిసారి.. భారత నేలపై రక్షణ ఆయుధాలు తయారవుతున్నాయి. మన దేశ కంపెనీలు, శాస్త్రవేత్తలు, యూత్ పవర్, రాష్ట్రాల భాగస్వామ్యం అన్నీ కలిసి ఇండియా సత్తాను.. ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ఈ డిఫెన్స్ ఎక్స్‌పోలో.. తొలిసారి 450కి పైగా ఒప్పందాలపై సంతకాలు జరుగుతున్నాయి.

ఈ ప్రపంచీకరణ యుగంలో.. మర్చంట్ నేవీ పాత్ర ఎంతో విస్తరించింది. అంతర్జాతీయ భద్రత నుంచి ప్రపంచ వాణిజ్యం దాకా సముద్ర భద్రత.. ప్రపంచ ప్రాధాన్యతగా మారిపోయింది. గత కొన్నేళ్లలో.. భారత్‌పై ప్రపంచ దేశాల అంచనాలు కూడా పెరిగాయి. ఇప్పుడు వాటిని భారత్ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ డిఫెన్స్ ఎక్స్‌పో.. ఇండియా పట్ల మిగతా దేశాలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయుధాల తయారీతో.. దేశ భద్రత మరింత సమర్ధవంతంగా తయారవుతుంది. ముఖ్యంగా.. భారత్-ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్, ఇండియన్ ఒషియన్ రీజియన్ ప్లస్ సమావేశాల్లో.. ఇండియా తన సైనిక హార్డ్‌వేర్‌ని వివిధ దేశాలకు అందించనుంది. దీని ద్వారా.. శాంతి, భద్రత, శ్రేయస్సుతో పాటు రక్షణ సహకారాన్ని ప్రోత్సహించేందుకు.. కొత్త రక్షణ, పారిశ్రామిక భాగస్వామ్యాలను నెలకొల్పేందుకు.. వీలవుతుంది.

ఈ డిఫెన్స్ ఎగ్జిబిషన్‌లో.. ఎంవోయూలతో పాటు ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఒప్పందాలు, ఆయుధ ఉత్పత్తుల ఆవిష్కరణల పరంగా.. 450కి పైగా ఎంవోయూలు కుదిరే అవకాశం ఉంది. గత డిఫెన్స్ ఎక్స్‌పోతో పోలిస్తే.. ఈ నెంబర్ చాలా ఎక్కువ. అప్పుడు కేవలం 210 ఒప్పందాలు మాత్రమే కుదిరాయి. భారత్, ఆఫ్రికా సన్నిహిత మిత్ర దేశాలు మాత్రమే కాదు భాగస్వామ్య దేశాలు కూడా. దీనిని.. మరింత ముందుకు తీసుకెళ్లేలా.. ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్నాయి. కంపెనీల ప్రతినిధులు చర్చించుకోవడం, వారి సామర్థ్యాన్ని పెంపొందించడం, పైరసీ, డ్రగ్స్ ట్రాఫికింగ్ లాంటి సముద్రపు బెదిరింపులను.. కలిసి ఎదుర్కోవడంపై ఓ నిర్ణయానికి రానున్నారు.

2025 నాటికి ఏరోస్పేస్, డిఫెన్స్ ఉత్పత్తుల్లో.. లక్షా 75 వేల కోట్ల టర్నోవర్ సాధించాలని.. కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నేళ్లుగా.. దేశంలో రక్షణ ఎగుమతులు వృద్ధి చెందుతూ వస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 13 వేల కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో 8 వేల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం.. 75 దేశాలు ఈ డిఫెన్స్ ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి. ఇండియా-ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్‌లో 43 కంటే ఎక్కువ ఆఫ్రికా దేశాలు పాల్గొంటున్నాయి. ఇండియన్ ఓషియన్ రీజియన్ ప్లస్ కాన్‌క్లేవ్‌లో పాల్గొనేందుకు.. 44 దేశాలు కలిసొచ్చాయి. ఈ ఎడిషన్‌లో పాల్గొనేందుకు.. 33 దేశాల విదేశాంగ మంత్రులు కూడా రానున్నా. మొత్తం.. 1340 భారతీయ కంపెనీలు, 10 రాష్ట్రాల పెవిలియన్‌లు.. ఈ డిఫెన్స్ ఎక్స్‌పోలో భాగమయ్యాయి.

డిఫెన్స్ ఎక్స్‌పోలో భాగంగా.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్ గార్డ్, డీఆర్డీవోలతో.. లైవ్‌లో విన్యాసాలను ప్రదర్శిస్తారు. అలాగే.. భూమి, సముద్రం, ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్న సిస్టమ్‌లను ప్రదర్శిస్తారు. ఇందులో భాగంగా కాంబాట్ ఫ్రీఫాల్, సారంగ్ హెలో ఏరోబాటిక్స్, హెలికాప్టర్ల నుంచి పడవలోకి రావడం, హై స్పీడ్ బోట్ రన్‌తో పాటు శత్రువుల పోస్టులను.. న్యూట్రల్ చేయడం లాంటి వాటిపై ప్రదర్శనలుంటాయి.

 

ట్రెండింగ్ వార్తలు