ఎలక్షన్ అఫిడవిట్ : మోడీ ఆస్తులు ఎంతంటే? 

సార్వత్రిక ఎన్నికల వేళ.. వారణాసి నుంచి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (ఏప్రిల్ 26, 2019) కలెక్టరేట్ కార్యాయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

  • Publish Date - April 26, 2019 / 01:58 PM IST

సార్వత్రిక ఎన్నికల వేళ.. వారణాసి నుంచి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (ఏప్రిల్ 26, 2019) కలెక్టరేట్ కార్యాయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

సార్వత్రిక ఎన్నికల వేళ.. వారణాసి నుంచి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (ఏప్రిల్ 26, 2019) కలెక్టరేట్ కార్యాయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉన్న తన నివాసంతో కలిపి మొత్తం ఆస్తులను రూ.2.5 కోట్లుగా మోడీ ప్రకటించారు.

ఎన్నికల కమిషన్ ఎదుట ఎలక్షన్ అఫిడవిట్ ను దాఖలు చేసిన మోడీ.. ఫిక్సడ్ డిపాజిట్లు రూ.1.27 కోట్లు, రూ.38వేల 750 నగదు రూపంలో చూపించారు. తన భార్య పేరు జశోదాబిన్ గా అఫిడవిట్ లో తెలిపారు. 1983 లో గుజరాత్ యూనివర్శిటీ నుంచి M.A డిగ్రీ పూర్తి చేసినట్టు చూపించారు. 1978లో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ గా తెలియజేశారు. 1967లో గుజరాత్ బోర్డు నుంచి SSC పూర్తి చేసినట్టు అఫిడవిట్ లో ప్రస్తావించారు. చర ఆస్తులు మొత్తం రూ.1.41 కోట్లు, స్థిర ఆస్తులను రూ.1.1 కోట్లుగా మోడీ ప్రకటించారు. 
Also Read : అనుమానితుల ఫొటోలను తప్పుగా ప్రకటించిన శ్రీలంక

ట్యాక్స్ సేవింగ్ ఇన్ ఫ్రా బాండ్లలో రూ.20వేలు ఇన్వెస్ట్ చేయగా.. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC)లో రూ.7.61 లక్షలు, LIC పాలసీలపై రూ.1.9లక్షలుగా ప్రకటించారు. మోడీ తన సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లలో రూ.4వేల 143 క్యాష్ బ్యాలెన్స్ ఉన్నట్టు ప్రకటించారు. మోడీకి 45గ్రాముల బరువైన 4 గోల్డ్ రింగ్స్ ఉండగా.. వీటి విలువ రూ.1.13 లక్షలుగా అఫిడవిట్ లో తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే మోడీ.. గాంధీనగర్ లో 3వేల 531 చదరపు అడుగుల ప్లాట్ కలిగి ఉన్నారు. దీని విలువ రూ. 1.1 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు.  

ప్రభుత్వం నుంచి వచ్చే వేతనం, బ్యాంకుల నుంచి వడ్డీ, భార్య తరపున నుంచి వచ్చే ఆదాయ వివరాలను కూడా అఫిడవిట్ లో ప్రస్తావించారు. తనపై ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని మోడీ అఫిడవిట్ లో ప్రకటించారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ తన మొత్తం ఆస్తులను రూ.1.65 కోట్లుగా ప్రకటించారు.