కూటమిలపై భయం లేదు : విపక్షాలపై మోడీ ఫైర్

  • Publish Date - January 20, 2019 / 01:12 AM IST

ఢిల్లీ : స్వార్థ రాజకీయాల కోసమే విపక్షాలు కూటమి కట్టాయని ప్రధాని నరేంద్రమోది తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కూటమి కేవలం మోదికి మాత్రమే వ్యతిరేకం కాదని…దేశ ప్రజలకు కూడా వ్యతిరేకమని మోది అన్నారు. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రాకముందే పంపకాలపై దృష్టి పెట్టాయని మండిపడ్డారు. తమ కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఎన్ని కూటమిలు కట్టినప్పటికీ తాము చేసిన కర్మ నుంచి వారు తప్పుకోలేరని ధ్వజమెత్తారు. దేశాన్ని దోపిడీ చేసేవాళ్లకు ప్రజలు స్థానమివ్వరని మోది స్పష్టం చేశారు. బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యేను చూసి మమత ప్రభుత్వం హడలెత్తిపోతోందని…బీజేపీ నుంచి రక్షించుకోవడానికి దేశంలోని నేతలంతా ఒక్కట్టయ్యారని ఎద్దేవా చేశారు.