PM Narendra Modi : కాన్వాయ్‌ని ఆపి.. అంబులెన్స్‌కు దారిచ్చిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పాటు వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు.

Modi stopped his convoy to give way to an ambulance

Pm modi: ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పాటు వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలో పెద్ద మనస్సు చాటుకున్నారు. తన కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు. వారణాసిలో తన రెండురోజుల పర్యటనలో..మోదీ వారణాసి, పూర్వాంచల్‌లో రూ. 19,000 కోట్ల రూపాయల విలువైన 37 ప్రాజెక్టులను ప్రారంభింస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహిస్తుండగా.. అదే రోడ్‌లో ఒక అంబులెన్స్ వచ్చింది. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్ పక్కకు తప్పుకుని అంబూలెన్స్‌కు దారి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రధాని మోదీ ప్రస్తుతం తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తున్నారు. పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. దీంట్లో రోడ్లు, వంతెనలు, ఆరోగ్యం,విద్య,పోలీసు సంక్షేమం, స్మార్ట్ సిటీ, పట్టణాభివద్ధి ప్రాజెక్టులు, రైల్వేలు, విమానాశ్రయం వంటి పలు ప్రాజెక్టులున్నాయి.