PM Narendra Modi take blessings from Kushboo Sundar mother in law Deivanai Chidambaram Pillai
PM Modi : ప్రధాని మోదీ ప్రస్తుతం తమిళనాడు(Tamilnadu) పర్యటనలో ఉన్నారు. గత రెండు రోజులుగా తమిళనాడులోని పలు ఆలయాలు, రామేశ్వరం.. ప్రాంతాలను సందర్శించారు. అలాగే పలు కార్యక్రమాల్లో కిడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను కూడా కలిశారు. సీనియర్ నటి కుష్బూ(Kushboo Sundar) కూడా బీజేపీ(BJP) పార్టీ నాయకురాలు అని తెలిసిందే.
మోదీ తమిళనాడుకు రావడంతో కుష్బూ ఆయన్ను కలిసింది. అయితే కుష్బూతో పాటు ఆమె అత్తగారు దేవనై చిదంబరం పిళ్ళై కూడా మోదీని కలిశారు. మోదీ.. కుష్బూ అత్త గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆవిడ మోదీని చూసి చాలా సంతోషించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను కుష్బూ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా సంతోషంగా ఓ పోస్ట్ చేసింది.
Also Read : Salaar : ‘సలార్’ సినిమా నుంచి అభిమానుల సందేహాలు.. ప్రశాంత్ నీల్ భార్య సమాధానాలు..
తన అత్త వద్దనుంచి మోదీ ఆశీర్వాదాలు తీసుకునే ఫొటోలు షేర్ చేసి.. మోదీ గారికి అభిమాని అయిన మా అత్త శ్రీమతి దేవనై చిదంబరం పిళ్ళై ఆయన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడకు ఇంత ఆనందాన్ని ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ గారికి థ్యాంక్స్ చెప్పాలంటే మాటలు కూడా సరిపోవట్లేదు. మోదీ గారిని ఒక్కసారైనా కలవాలి అనేది ఆమె లైఫ్ డ్రీం. వరల్డ్ పాపులర్ లీడర్ అయిన మన మోదీ గారు ఆవిడని చాలా సాదరంగా ఆహ్వానించారు. ఒక కొడుకు తల్లితో మాట్లాడినట్టు మాట్లాడారు. మా అత్తగారి వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నారు. మిమ్మల్ని కలవడం మర్చిపోలేనిది. మా అత్తయ్య కళ్ళల్లో చిన్నపిల్లలా ఆనందం చూశాను. ఈ వయసులో ఆమెని ఇలా సంతోషంగా చూడటం కంటే ఏది ఎక్కువ కాదు. మీకు ఎప్పటికి రుణపడి ఉంటాము మోదీజీ అని పోస్ట్ చేశారు కుష్బూ. దీంతో కుష్బూ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవ్వగా మరోసారి అందరూ మోదీజీని అభినందిస్తున్నారు.